గజ్వేల్‌రూరల్: పాలిటెక్నిక్‌ను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయొద్దని గజ్వేల్‌లోని జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రోడ్డెక్కారు. శుక్రవారం పట్టణంలోని బాలుర ఎడ్యుకేషన్ హబ్ ఆవరణలో గల పాలిటెక్నిక్ కళాశాల నుంచి ఇందిరాపార్కు చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పాలిటెక్నిక్‌ను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశముందని, దీంతో పాలిటెక్నిక్ పూర్తయిన విద్యార్థులు ఉన్నత విద్య అయిన ఇంజినీరింగ్‌లో చేరే అవకాశం కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి పాలిటెక్నిక్‌ను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయకుండా యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.


