న్యూస్‌రీల్
నారాయణఖేడ్: విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఖేడ్ తహసీల్ గ్రౌండ్‌లో పట్టణంలోని గురుకులాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఫ్లాగ్‌మార్చ్, సాంస్కృతిక ప్రదర్శనలు తదితర అంశాలపై శనివారం పోటీలను నిర్వహించారు. ఒక్కో అంశానికి సంబంధించి ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచిన విద్యార్థులకు అవార్డులతోపాటు పాల్గొన్న పాఠశాలలకు ధ్రువపత్రాలను అందజేశారు. ఖేడ్‌లో ఇండోర్, ఔట్‌డోర్ స్టేడియంల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. మున్సిపల్ చైర్మన్ నగేశ్‌షెట్కార్, నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, దారం శంకర్, డీఎస్పీ వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు, సీఐలు, ఎస్‌ఐలు, అధికారులు పాల్గొన్నారు.
నారాయణఖేడ్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమర వీరుడు శ్రీకాంతచారి జయంతిని పురస్కరించుకుని శనివారం స్థానిక బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీకాంతచారి చౌక్‌లోని ఆయన విగ్రహానికి ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు వేర్వేరుగా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
న్యాల్‌కల్(జహీరాబాద్): మండల పరిధిలోని రేజింతల్ గ్రామంలోని రైతు వేదిక వద్ద శనివారం జాతీయ పతాకావిష్కరణ జరగలేదు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ జెండాను తప్పకుండా ఎగురవేయాలని నిబంధనలున్నా అధికారులు వాటిని పట్టించుకోలేదని పలువురు గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ప్రతి ఏటా రైతు వేదిక వద్ద జాతీయ జెండా ఆవిష్కరించే వారని ఈసారి విస్మరించారని తెలిపారు. ఈ విషయమై మండల వ్యవసాయ శాఖ అధికారి అభినాష్ వర్మను వివరణ కోరగా అక్కడ పని చేసే ఏఈఓ సెలవుల్లో ఉండటం వల్ల జెండాను ఎగుర వేయలేదని సమాధానమిచ్చారు.


