సంగారెడ్డి జోన్: స్వాతంత్య్ర సమరయోధుల ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ సంగీత పేర్కొన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం జాతీయ పతాకాన్ని సంగీత ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ...ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతీ ఒక్కరికి అందజేయడంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు.
ఎస్పీ కార్యాలయంలో...
సంగారెడ్డి జోన్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఎస్పీ పరితోశ్ పంకజ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నారాయణఖేడ్‌లో..
నారాయణఖేడ్: ఖేడ్ పట్టణంతోపాటు మండలంలోని గ్రామాల్లో శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఖేడ్ గాంధీచౌక్‌లో ఎంపీ సురేశ్ షెట్కార్, క్యాంపు కార్యాలయం, ఇందిరాచౌక్ వద్ద ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో సబ్ కలెక్టర్ ఉమాహారతి, మున్సిపల్ కార్యాలయ ఆవరణలో చైర్మన్ నగేశ్ షెట్కార్, శ్రీనివాస కళాశాల వద్ద మాజీ ఎమ్మెల్యే విజయపాల్‌రెడ్డి, బీఆర్‌ఎస్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, వివిధ కార్యాలయాల వద్ద సంబంధిత అధికారులు జెండాలను ఎగురవేశారు.
జహీరాబాద్‌లో..
జహీరాబాద్: భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జహీరాబాద్‌లో ఘనంగా జరుపుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలపై జాతీయ పతాకాలను ఎగురవేశారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు జాతీయ పతాకం ఆవిష్కరించారు. జాతీయ పతాకం తలకిందులుగా ఎగురుతున్న విషయాన్ని గమనించి సరైన దిశలో ఎగురవేశారు. ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ దేవుజా, మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ యూనూస్, తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ దశరథ్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మహేందర్‌రెడ్డి, మార్కెట్ కార్యాలయంలో చైర్మన్ సాయిచరణ్, సీడీసీ కార్యాలయంలో చైర్మన్ ముబీన్‌లు జాతీయ పతాకాలను ఎగురవేశారు.
జాతీయ జెండా ఆవిష్కరిస్తున్న ఎస్పీ పరితోశ్ పంకజ్, తదితరులు
జాతీయ జెండా ఆవిష్కరిస్తున్న అదనపు కలెక్టర్ సంగీత


