సిగాచి బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

సిగాచి బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి

Aug 17 2026 7:23 AM | Updated on Aug 17 2026 7:23 AM

పటాన్‌చెరుటౌన్‌: సిగాచి బాధిత కుటుంబాలకు మిగిలిన నష్టపరిహారాన్ని చెల్లించే విధంగా చూడాలని ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. సంగారెడ్డిలో శనివారం జరిగిన సమావేశంలో పాల్గొని, పలు కార్మికుల అంశాలపై సీఎంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కాంట్రాక్ట్‌ కార్మికుల వేతనాలను 2026 జూన్‌ నుంచి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు పెంచినందుకు సుమారు 2 లక్షల మంది కార్మికుల తరఫున కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రకటించిన రూ.కోటి పరిహారంలో మిగిలిన మొత్తాన్ని త్వరగా చెల్లించాలని కోరారు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సదుపాయాలు లేని సుమారు 3 లక్షల మంది హమాలీ కార్మికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పటానన్‌చెరు, బొల్లారం, ఇస్నాపూర్‌ ప్రాంతాలకు ప్రభుత్వ స్థలంలో సొంత ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మించాలని, కార్మికుల గృహనిర్మాణం కోసం టీజీఐఐసీ ద్వారా ప్రభుత్వ ధరలకు స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశామన్నారు.

సీఎంకు వినతిపత్రం అందజేసిన నర్సింహారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement