భక్తిశ్రద్ధలతో నాగులకట్ట వార్షికోత్సవం | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో నాగులకట్ట వార్షికోత్సవం

Aug 15 2026 7:29 AM | Updated on Aug 15 2026 7:29 AM

భక్తిశ్రద్ధలతో నాగులకట్ట వార్షికోత్సవం నేటి నుంచి దర్గా ఉత్సవాలు ఘనంగా బోనాల పండుగ సోలార్‌ లైట్లు ప్రారంభం రైతులు ఆందోళన చెందొద్దు మహిళా సంఘాలకు శిక్షణ

సదాశివపేట(సంగారెడ్డి): పట్టణంలోని పాతకెరీ నాగులకట్ట వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మాజీ కౌన్సిలర్‌ ఓదెల మాణిక్‌రావు, రాజేశ్వరీ దంపతులు ఆధ్వర్యంలో వార్షికోత్సవం సందర్భంగా పూజారులతో నాగులకు అభిషేకం నిర్వహించారు, అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో విజయ్‌కుమార్‌, పృథ్వీరాజ్‌, విష్ణువర్ధన్‌రెడ్డి, విఠల్‌, దుర్గా రాజేశ్‌, మల్లేశం, పాండు, నాగరాజు, పరుశరామం, శ్రీశైలం, సాయిరాం భక్తులు తదితరులు పాల్గొన్నారు.

జోగిపేట, వట్‌పల్లి (అందోల్‌): జోగిపేట సమీపంలోని అన్నాసాగర్‌ దర్గా ఉత్సవాలు శనివారం నుంచి 17వ తేదీ వరకు కులమతాలకు అతీతంగా ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఉత్సవాలకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ హాజరుకానున్నారు.

జిన్నారం (పటాన్‌చెరు): తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. జిన్నారం కస్తూర్భా గాంధీ కళాశాలలో విద్యార్థినులు సంప్రదాయ వస్త్రధారణతో చేపట్టారు.

హత్నూర(సంగారెడ్డి): అరబిందో పరిశ్రమ సహకారంతో పల్పనూరులో ఏర్పాటు చేసిన నాలుగు సోలార్‌ లైట్లను శుక్రవారం సర్పంచ్‌ బంటు రాయుడు ప్రారంభించారు. గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద నాలుగు సోలార్‌ లైట్లు అమర్చగా వాటిని ప్రారంభించడంతో ప్రజలకు చీకట్లో ఎంతో ఉపయోగపడినట్లు సర్పంచ్‌ తెలిపారు. అరబిందో పరిశ్రమ సహకారంతోనే పలు అభివద్ధి పనులు గ్రామంలో చేపడుతున్నట్లు తెలిపారు.

● యూరియా నిల్వలు పుష్కలం

● జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌ కుమార్‌

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలోని రైతులు యూరియా కోసం ఎలాంటి ఆందోళన చెందవద్దని, నిల్వలు పుష్కలంగా ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 2403 మెట్రిక్‌ టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. మార్క్‌ఫెడ్‌ వద్ద 1855 మెట్రిక్‌ టన్నులు, రిటైలర్ల వద్ద 548 మెట్రిక్‌ టన్నులు ఉన్నాయని తెలిపారు. ఈనెల 7వ తేదీ నుంచి ఎఫ్‌ఎస్‌ఎస్‌ యాప్‌ ద్వారా యూరియా విక్రయిస్తున్నామని చెప్పారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ యాప్‌ ద్వారా బుక్‌ చేసుకున్న రైతులందరికి యూరియా అందజేయనున్నట్లు వెల్లడించారు. అలాగే ప్రతిరోజూ యూరియా స్టాక్‌ను అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు. రిటైలర్‌ కేంద్రాల వద్ద ఉన్న వలంటీర్లు, రైతు వేదికల వద్ద ఉండే ఏఈఓలు రైతులకు యాప్‌ ద్వారా యూరియా బుకింగ్‌ చేసే విధానంపై అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. రైతులకు బుకింగ్‌ చేయడంలో సహాయం అందిస్తూ, వారి సమస్యలను పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు.

చిన్నశంకరంపేట(మెదక్‌): ప్లాస్టిక్‌ నిర్మూలనకు ప్రత్యామ్నాయంగా కొబ్బరి పీచుబొమ్మల తయారీకి మహిళా సంఘాలకు శిక్షణ అందిస్తున్నట్లు నాబార్డ్‌ మెదక్‌ జిల్లా ఏజీఎం కృష్ణతేజ తెలిపారు. శుక్రవారం చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలోని మహిళా సమైక్యా సభ్యులకు కొబ్బరిపీచు ఉత్పత్తుల తయారీపై ఆవగాహన కల్పించారు. మహిళా సంఘాల సభ్యులు ముందుకు వచ్చి ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ప్రవీణ్‌కుమార్‌, కోఆర్టినేటర్‌ గోపిరెడ్డి, ఐకేపీ ఏపీఎం రాములు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement