ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో తనిఖీలు

Aug 12 2026 7:54 AM | Updated on Aug 12 2026 7:54 AM

● మూడు ఆస్పత్రులకు నోటీసులు ● మెహర్‌ ఫిజియోథెరపీ క్లినిక్‌ సీజ్‌

● మూడు ఆస్పత్రులకు నోటీసులు ● మెహర్‌ ఫిజియోథెరపీ క్లినిక్‌ సీజ్‌

సంగారెడ్డి: జిల్లా పరిధిలోని వివిధ ప్రైవేటు ఆస్పత్రులను జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులతో కలిసి మంగళవారం తనిఖీలు చేశారు. సంగారెడ్డి పట్టణంలోని 20 ప్రైవేట్‌ ఆస్పత్రులు, వైద్య సంస్థలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఆస్పత్రుల్లో నిబంధనల అమలు, రికార్డుల నిర్వహణ, వైద్య సేవలు తదితర అంశాలను పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా లేని మన, వెల్నెస్‌, పరి పేరుతో ఉన్న మూడు ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారు. పోతిరెడ్డిపల్లిలోని మెహర్‌ ఫిజియోథెరపీ క్లినిక్‌ రెన్యూవల్‌ చేసుకోకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించడంతో నిబంధనల ప్రకారం క్లినిక్‌ను మూసివేశారు. జిల్లాలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే ఆస్పత్రులు, క్లినిక్‌లపై నిరంతరం తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. లలితాదేవి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement