సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ శ్రీధర్
సిద్దిపేటజోన్: సిమెంట్ వ్యాపారరంగంలో తిరుగు లేని సంస్థగా వికాట్ గ్రూపు భారతి సిమెంట్ ఎదుగుతుందని సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ శ్రీధర్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని శ్రీమంజునాధ ట్రేడర్స్ ఆధ్వర్యంలో తాపీ మేసీ్త్రల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మార్కెట్‌లో లభించే ఇతర సిమెంట్‌తో పోల్చితే భారతి అల్ట్రా ఫాస్ట్‌తో నిర్మాణ ప్రక్రియ చాలా వేగవంతంగా పూర్తి అవుతుందన్నారు. అల్ట్రా ఫాస్ట్ స్లాబులు, ఫిల్లర్లు, బ్రిడ్జిలు, రహదారుల నిర్మాణానికి సరైన ఎంపిక అని గుర్తు చేశారు. మార్కెట్‌లో లభించే ఇతర సిమెంట్ ధరల కంటే రూ. 20 అధికంగా ఉంటుందని పేర్కొన్నా రు. ఈ సందర్భంగా డీలర్ శ్రీకాంత్ మాట్లాడుతూ... భారతి సిమెంట్ సర్వీస్ చాలా వేగవంతంగా ఉంటుందని, అధికంగా అమ్మకాలు అవుతున్నట్టు పేర్కొన్నారు. స్లాబ్ కాంక్రీట్ సమయంలో నిపుణులైన భారతి సిమెంట్ ఇంజనీర్లు సైట్ వద్దకు వచ్చి సాంకేతిక సలహాలు, సూచనలను ఇచ్చి సహాయపడుతారన్నారు. అనంతరం తాపీ మేసీ్త్రలకు రూ. లక్ష ఉచిత ప్రమాద బీమా పత్రాలను సంస్థ ద్వారా పంపిణీ చేశారు. ఈ సమావేశంలో భారతి సిమెంట్ డీలర్ శ్రీకాంత్, సుమారు 50 మందికి పైగా తాపీ మేసీ్త్రలు పాల్గొన్నారు.


