చేగుంట(తూప్రాన్): అదుపుతప్పి టమాటా లారీ బోల్తాపడింది. ఈ సంఘటన మండల కేంద్రమైన మాసాయిపేట శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు టమాటా లోడుతో వెళ్తున్న లారీ మాసాయిపేట వద్ద జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో దాదాపు లక్ష రూపాయలకు పైగా విలువచేసే టమాటాలు పాడయ్యాయని స్థానికులు పేర్కొన్నారు. కాగా ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి. ట్రాఫిక్‌ను గుర్తించిన పోలీసుల సహాయక చర్యలు చేపట్టారు.
లోడుతో వెళ్తున్న లారీ..
శివ్వంపేట(నర్సాపూర్): విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు అతి సమీపంలో లారీ బోల్తా పడగా పెను ప్రమాదం తప్పింది. గురువారం రాత్రి చేగుంట నుంచి పటాన్‌చెరుకు లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి తూప్రాన్– నర్సాపూర్ హైవే శివ్వంపేట పోలీస్ స్టేషన్ ఎదుట బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ పవన్ యాదవ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కాగా రెండు మీటర్ల దూరంలోనే ట్రాన్స్‌ఫార్మర్ ఉన్నదని తెలిపారు.
అదుపుతప్పిన పైపుల లారీ
చిన్నకోడూరు(సిద్దిపేట): అదుపుతప్పి లారీ రోడ్డు పక్కకు దూసుకుపోగా డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని ఇబ్రహీంనగర్, గోనెపల్లి రోడ్డులో శుక్రవారం చోటు చేసుకుంది. సిమెంట్ పైపుల భారీ లారీ మందపల్లికి వెళ్తుంది. ఈ క్రమంలో ఆ గ్రామాల మధ్య మూల మలుపువద్ద అదుపుతప్పి లారీ రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఆ సమయంలో ఎవ్వరూ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.


