జిన్నారం (పటాన్‌చెరు): ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధికి పరిశ్రమల సహకారం అభినందనీయమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ప్రశంసించారు. గడ్డపోతారం పట్టణ పరిధిలోని వావిలాల ప్రభుత్వ పాఠశాలలో బాలవికాస్ ఫౌండేషన్ సౌజన్యంతో మోల్డ్ టెక్ పరిశ్రమ రూ.25 లక్షల సీఎస్‌ఆర్ నిధులతో నిర్మించనున్న రెండు పాఠశాల గదులను మంగళవారం ప్రారంభించారు. పాఠశాలకు వెళ్లే దారిలో సీసీ రోడ్డు లేకపోవడంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యను ఆయన ప్రత్యక్షంగా వీక్షించారు. సీసీ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని కమిషనర్ తాన్యను ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ...విద్యార్థులు ఇష్టంతో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాక్షించారు. విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మ గణేష్, వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్, ఫౌండేషన్ అధ్యక్షుడు ఇంద్రారెడ్డి, డైరెక్టర్ శౌరిరెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు బాల్‌రెడ్డి, వెంకటేశంగౌడ్, పరిశ్రమ ప్రతినిధులు ఉగేష్, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి


