పొరుగు కూలీలే దిక్కు! | - | Sakshi
Sakshi News home page

పొరుగు కూలీలే దిక్కు!

Aug 4 2026 9:54 AM | Updated on Aug 4 2026 9:54 AM

వరినాట్లు వేస్తున్న ఇతర రాష్ట్రాల కూలీలు

వ్యవసాయంలో వరి నాట్లు మొదలుకొని.. ధాన్యం కేంద్రాల్లో హమాలీ పనుల వరకు ఇతర రాష్ట్రాల కూలీలే పని చేస్తున్నారు. అయితే రోజురోజుకు స్థానికంగా వ్యవసాయ కూలీల కొరత ఏర్పడటంతో పొరుగు రాష్ట్రాల కూలీలకు డిమాండ్‌ పెరిగింది.

–హత్నూర(సంగారెడ్డి)

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, వెస్ట్‌ బెంగాల్‌తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన సుమారు 700 పైచిలుకు వలస కూలీలు వరి నాట్లు వేసేందుకు గ్రామాల్లో పనిచేస్తున్నారు. చీక్‌ మద్దూర్‌, నవపేట్‌, హత్నూర, బడంపేట్‌, సిరిపుర, కాసాల , రెడ్డి ఖానాపూర్‌, దేవులపల్లి, బోరపట్లతో పాటు పలు గ్రామాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ కూలీలు స్థానికంగా ఉంటూ వరినాటు పనుల్లో మునిగిపోయారు. ఇక్కడ వరి నాటు వేసేందుకు రూ.5వేల నుంచి 5500 వరకు తీసుకుంటున్నారు. 15 మంది నుంచి 20 మంది కూలీలు రోజుకు ఆరు నుంచి ఏడెకరాల వరకు నాట్లు వేస్తున్నారు. ఉదయాన్నే పొలంలోకి వెళ్లి రాత్రి వరకు పనిచేస్తున్నారు. వరి నాట్లు వేసే సమయంలో ఎరువులు చల్లడానికి రూ.70 నుంచి రూ. 100 వరకు అదనంగా తీసుకుంటున్నారు. కూలీలను తీసుకెళ్లడానికి రవాణా చార్జీలు సైతం రైతులే చెల్లిస్తున్నారు. దీంతో ఎకరా వరి నాటు వేయడానికి సుమారు రూ. 6వేల నుంచి 7వేల వరకు రైతు కూలీలకు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.

జిల్లా వ్యాప్తంగా చాలా మండలాల్లో వేలాదిమంది ఇతర రాష్ట్రాల కూలీలు వలస వచ్చి వరి నాట్లు వేస్తున్నారు. గ్రామాల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నారన్న పేరు తప్ప కూలీల కొరత వల్ల పొరుగు కూలీలపై ఆధారపడి సాగు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వరి నాట్లు వేసేందుకు.. పంట పండిన తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా హమాలీ కూలీలుగా పనిచేసేందుకు ఇతర రాష్ట్రాల కూలీలే పెద్దదిక్కుగా మారారు. పొరుగు రాష్ట్రాల కూలీలు రాకుంటే మన ఎవుసానికి ఇబ్బందిగా మారే పరిస్థితి నెలకొంది.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ వారే..

జిల్లాలో వేలాది మంది ఉపాధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement