పెండింగ్‌ ఫీజులు విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ ఫీజులు విడుదల చేయాలి

Aug 4 2026 9:54 AM | Updated on Aug 4 2026 9:54 AM

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌తో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజినీకాంత్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం సంగారెడ్డిలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా వర్క్‌ షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రజనీకాంత్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు రావాల్సిన స్కాలర్‌ షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు దాదాపు రూ.12 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థులు బకాయిలు కట్టలేక పైచదువులకు వెళ్లలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు రావాల్సిన స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజేశ్‌, సతీశ్‌, జిల్లా ఉపాధ్యక్షులు అర్జున్‌, జిల్లా కో కన్వీనర్‌ వాణి, జిల్లా కమిటీ సభ్యులు సందీప్‌, రిషి, సామ్సన్‌, అభి, సాయి గౌడ్‌, హరి,కిరణ్‌, కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement