రామచంద్రాపురం(పటాన్‌చెరు): గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని కొల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన తెల్లాపూర్ డివిజన్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాకు చెందిన హరిజన్, సమీర్ హరిజన్ కలిసి తెల్లాపూర్ డివిజన్ పరిధిలో హాల్‌మార్క్ లేబర్‌క్యాంప్ వద్ద గంజాయిని విక్రయించేందుకు వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఆరు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.


