జహీరాబాద్: జహీరాబాద్‌కు నూతన ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే మాణిక్‌రావు డీజీపీ సీవీ ఆనంద్‌కు వినతిపత్రం అందజేశారు. బుధవారం హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శివకుమార్‌లతో కలిసి వినతిపత్రం అందజేశారు. జహీరాబాద్ పట్టణం రోజురోజుకు విస్తరిస్తోందని, దీంతో జనాభా భారీగా పెరుగుతున్నట్లు వివరించారు. అంతేకాకుండా పరిశ్రమలు, విద్యాసంస్థలు వెలుస్తున్నాయని, ప్రజా రవాణా వాహనాల రద్దీ సైతం పెరిగిందన్నారు. దీంతో పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా టౌన్ పోలీస్‌స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు ట్రాఫిక్‌ను నియంత్రించాలని కోరారు. సానుకూలంగా స్పందించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
డీజీపీ సీవీ ఆనంద్‌కు
ఎమ్మెల్యే మాణిక్‌రావు వినతి


