పశువులను తరలిస్తున్న వాహనం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

పశువులను తరలిస్తున్న వాహనం పట్టివేత

Aug 3 2026 9:13 AM | Updated on Aug 3 2026 9:13 AM

పశువులను తరలిస్తున్న వాహనం పట్టివేత

ములుగు(గజ్వేల్‌): డీసీఎం వాహనంలో పశువులను అక్రమంగా తరలిస్తున్న వారిపై ములుగు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏఎస్‌ఐ పండరి తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం వంటిమామిడి క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒక డీసీఎం వాహనంలో పశువులను తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహన డ్రైవర్‌ మహమ్మద్‌ తాహిర్‌ పాషా, అలీమొద్దీన్‌, మోసిన్‌లను విచారించగా ఎలాంటి అనుమతి లేకుండా పశువులను రవాణా చేస్తున్నట్లు వెల్లడైందని ఏఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని, పశువులను గోశాలకు తరలించామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement