ట్రాక్టర్‌ అదుపుతప్పి రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ అదుపుతప్పి రైతు మృతి

Aug 3 2026 9:13 AM | Updated on Aug 3 2026 9:13 AM

ట్రాక్టర్‌ అదుపుతప్పి రైతు మృతి

చిన్నశంకరంపేట(మెదక్‌): కేజ్‌వీల్స్‌తో ఉన్న ఓ ట్రాక్టర్‌ అదుపుతప్పి యువ రైతు మృతి చెందిన ఘటన మండలంలోని గవ్వలపల్లి శివారులో చోటుచేసుకుంది. ఎస్‌ఐ శివానందం కథనం మేరకు.. మండలంలోని ఆగ్రహారం గ్రామానికి చెందిన రైతు రాజు(28) ఆదివారం సొంత పొలం దున్నేందుకు కేజ్‌వీల్స్‌తో ఉన్న ట్రాక్టర్‌ తీసుకువెళ్లాడు. ఒక మడి దున్ని మరో మడి దగ్గరకు వెళ్తున్న క్రమంలో హైటెన్షన్‌ టవర్‌ పక్కన ట్రాక్టర్‌ అదుపు తప్పింది. దీంతో కిందపడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్‌ చెరువులోకి వెళ్లి పోయింది. అటుగా వెళ్తున్న వారు గమనించి రాజు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ట్రాక్టర్‌ అదుపుతప్పి పడిపోయాడా లేక హైటెన్షన్‌ టవర్‌ నుంచి విద్యుత్‌ సరాఫరా షాక్‌కు గురయ్యాడా అనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. రాజుకు 11 నెలల క్రితం పెళ్లయింది. భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement