ప్రధానోపాధ్యాయుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ప్రధానోపాధ్యాయుడి ఆత్మహత్య

Aug 3 2026 9:13 AM | Updated on Aug 3 2026 9:13 AM

నారాయణఖేడ్‌: ఓ ప్రధానోపాధ్యాయుడు ఇంటో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆదివారం ఎస్‌ఐ శ్రీశైలం, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చాప్టా(కె) గ్రామానికి చెందిన కపిల సిద్దిలింగప్ప(38), ఆయన భార్య భాగ్యలక్ష్మి పట్టణంలోని సాయిబాబాకాలనీలో నివాసం ఉంటున్నారు. మండలంలోని చందర్‌ నాయక్‌తండా మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఆయన హెచ్‌ఎంగా, భాగ్యలక్ష్మి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. అయితే సిద్దిలింగప్పకు మూర్చవ్యాధి ఉండగా కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో మూడురోజుల కిందట భాగ్యలక్ష్మి పిల్లలతో కలిసి తన తల్లి గారింటికి వెళ్లింది. సిద్దిలింగప్ప తన బావమరిది జ్ఞానేశ్వర్‌కు వీడియోకాల్‌ చేసి నేను చనిపోతున్నానని చెప్పాడు. దీంతో జ్ఞానేశ్వర్‌ వెంటనే అక్కడికి వెళ్లి చూడగా ఉరివేసుకుని ఉంటడం గమనించాడు. స్థానిక ఆస్పత్రికి తీసుకువెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి కపిల శరణప్ప చేసిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement