పర్యావరణ పోటీలకు సిద్ధమవుదామా! | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పోటీలకు సిద్ధమవుదామా!

Aug 3 2026 9:13 AM | Updated on Aug 3 2026 9:13 AM

మార్గదర్శకాలు..

ఐదు గ్రూపులుగా పోటీలు

ఈ అంశాల్లో ప్రశ్నలు

విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్విజ్‌ పోటీలు
ఐదు గ్రూపులుగా నిర్వహణ ● సెప్టెంబర్‌ 15 వరకు రిజిస్ట్రేషన్‌

● ప్రతి విద్యాసంస్థలో ఎన్‌ఎస్‌ పీసీ నోడల్‌ అధికారిని నియమించాలి. ఈ అధికారి సమన్వయం చేస్తూ నివేదికల బాధ్యత వహిస్తారు.

● ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలలు తమ బ్యాగ్‌ లెస్‌డేలో ఒక రోజును ఎన్‌ఎస్‌ పీసీడే గా ప్రకటించి, ఆగస్టు 15లోపు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అలాగే అన్ని జూనియర్‌, డిగ్రీ కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థలు కూడా ఒక శనివారంను ప్రకటించి చేయనున్నారు.

● ఆగస్టు 15లోపు ఎన్‌ఎస్‌ పీసీ పోటీలను పూర్తి చేసి విజేతలకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మెరిట్‌ సర్టిఫికెట్లను అందజేయాలి.

● ప్లేస్టోర్‌ నుంచి ‘ఎకోమిత్రమా’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని సైన్‌ ఇన్‌ చేసిన తర్వాత పాఠశాలకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ చేయాలి. అనంతరం క్యూఆర్‌ ద్వారా నమోదు, ఆన్‌లైన్‌ క్విజ్‌ను పూర్తి చేయడం, ధ్రువపత్రాన్ని డౌన్‌లోడ్‌ చేయడం ద్వారా వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనేలా ప్రోత్సహించాలి.

సదాశివపేట రూరల్‌(సంగారెడ్డి): విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించి, భాగస్వాములను చేసేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వశాఖ, మానవ వనరులు, విద్యా మంత్రి త్వ శాఖ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఆన్‌లైన్‌ వేదికగా నేషనల్‌ స్టూడెంట్‌ పర్యావరణ్‌ కాంపిటేషన్‌(ఎన్‌ఎస్‌ పీసీ) క్విజ్‌ పోటీలను దేశ వ్యాప్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. తెలంగాణ నేషనల్‌ గ్రీన్‌ కార్ప్స్‌(జాతీయ హరిత దళం) ప్రభుత్వ సహకారంతో పాఠశాల, కళాశాల, పరిశోధన విద్యార్థులకు, ఉపాధ్యాయులు, ఇతరులకు సైతం ఈ పోటీలను ప్రకటించారు. సెప్టెంబర్‌ 15 వరకు ప్రత్యేక వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.

జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో..

ఆన్‌లైన్‌ క్విజ్‌ పోటీల్లో జిల్లా స్థాయిలో అత్యధిక స్కోర్‌ సాధించిన ఐదుగురు విద్యార్థులకు, ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనేలా ప్రోత్సహించిన హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు కలెక్టర్‌ చేతుల మీదుగా బహుమతి, ప్రశంసా పత్రాలు అందజేస్తారు. రాష్ట్ర స్థాయిలో అత్యధిక స్కోర్‌ చేసిన విద్యార్థులు, ఎక్కువ సంఖ్యలో పాల్గొన్న జిల్లా అధికారులకు సీఎం బహుమతి, ప్రశంసా పత్రాలు ప్రదానం చేస్తారు. అలాగే జాతీయ స్థాయిలోనూ అందజేస్తారు.

గ్రూప్‌ తరగతి విద్యార్థులు

01 1 నుంచి 5 వరకు

02 6 నుంచి 8

03 9– ఇంటర్‌

04 యూజీ, పీజీ విద్యార్థులు, రీసెర్చ్‌ స్కాలర్లు

05 ఇతర కేటగిరీల వారు

పర్యావరణంపై అవగాహన, పర్యావరణ పరిరక్షణ, హరితగృహ ప్రభావం, సహజ వనరుల వినియోగం, శిలాజ ఇంథనాలు, అడవుల పరిరక్షణ ఆవశక్యత తదితర అంశాలపై క్విజ్‌ ప్రశ్నలు ఉంటాయి. తుది ఫలితాలను సెప్టెంబర్‌ 20న ప్రకటిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement