
వైరల్ పరీక్ష
జోగిపేట ఆస్పత్రికి తరలివచ్చినరోగులు
జోగిపేట ఏరియా ఆస్పత్రిలో వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న వారంతా రక్త నమూనా, యూరిన్ టెస్టుల కోసం ఎగబడ్డారు. సోమవారం సుమారుగా వెయ్యికి పైగా ఓపీ పేషెంట్‌లు నమోదయ్యారు. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా చాలా మంది జ్వరాల బారిన పడ్డారు. పరీక్షించిన వైద్యులు.. అందరికి టెస్టులకు రాయడంతో ల్యాబ్ వద్ద వందల సంఖ్యలో గుమి గూడారు. వాగ్వాదం.. తోపులాటతో గందరగోళం ఏర్పడింది. ఒకేసారి ఐదుగురు రోగులకు చొప్పున పిలిచి పరీక్షలు నిర్వహించారు.
– జోగిపేట(అందోలు)
జోగిపేట ఆసుపత్రిలో ల్యాబ్ వద్ద కిక్కిరిసిన రోగులు