
విద్యుదాఘాతంతో కూలీ..
సిద్దిపేటరూరల్: విద్యుదాఘాతంతో కూలీ మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని పుల్లూరు గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. రూరల్ ఎస్‌ఐ రాజేశ్ వివరాల మేరకు... వరంగల్ రూరల్ జిల్లా ఆర్జన్పల్లికి చెందిన అవ్వుల రాజు (25) వారం రోజుల క్రితం భార్య రాజేశ్వరితో కలిసి పుల్లూరులోని ముత్యంరెడ్డి కోళ్లఫారంలో పనిలో చేరాడు. మధ్యాహ్న సమయంలో ఫామ్ చుట్టూ పరద కడుతున్న సమయంలో పక్కనే ఉన్న విద్యుత్తు తీగలకు ప్రమాదవశాత్తు ఇనుప నిచ్చెన తగలడంతో రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన భార్య కేకలు వేయడంతో పుల్లూరు చౌరస్తాలో వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులు వచ్చి సీపీఆర్ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. మృతుడికి ఒక కుమార్తె, కాగా భార్య గర్భవతి.