
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
రామచంద్రాపురం (పటాన్‌చెరు): సీబీఎస్‌ఈ తైక్వాండో సౌత్ జోన్–1 టోర్నమెంట్ ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం కమల హైస్కూల్ ఆధ్వర్యంలో ఆగస్టు 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో భారతీయ విద్యాభావన్ పబ్లిక్ స్కూల్, బీహెచ్‌ఈఎల్ విద్యార్థినులు ఎం.హృతిక, ఎం.హొన్నేశా రజత పతకాలు సాధించి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీలు సెప్టెంబర్ 3 నుంచి 7వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్‌లో జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ చెబోలు ఉమాశాస్త్రి, వైస్ ప్రిన్సిపాల్ శ్రీవాణి విజేతలను అభినందించారు. జాతీయ స్థాయిలో నూ విజయం సాధించాలని ఆకాంక్షించారు.
విద్యార్థినులు హృతిక,
హొన్నేశాలకు ప్రిన్సిపాల్ అభినందన