
‘మనలో చాలా మంది చిన్నప్పుడు కథలు వినడంలో అనుభవం పొంది ఉండము.. రాజులు, రాణులు, చెవులు రిక్కింపజేసే యుద్ధాలు, మంత్రముగ్ధులను చేసే మాయా ద్వీపాలు ఇవన్నీ కళ్లకు కట్టేలా విని ఉండము.. వింటూ వింటూనే మనం నిద్రలోకి జారుకున్న ఆనవాళ్లూ లేకపోవచ్చు.. ఒక రకంగా అంతకు ముందు తరం అనుభవించిన ఆనందాన్ని బాల్యంలో అనుభవించలేదేమో.. ఆ కథలు జోలపాట పాడుతూనే.. భవిష్యత్తు పాఠాలను కూడా నేర్వలేదు.. అందుకే ఆ కథలు ఇప్పుడు వినాల్సిందే. ఊ కొట్టాల్సిందే అంటున్నారు లక్ష్ మహేశ్వరి.
కథల్లోకి అడుగు..
అయితే నచ్చే మార్గాన్ని కనుగొనడానికి నాకు మరో ఎనిమిది సంవత్సరాలు పట్టింది. నేను 2023లో కథ చెప్పడం అనే మార్గంలోకి అడుగుపెట్టాను. కథ చెప్పడం అంత తేలికైన కళ కాదు. దీనికి క్రమశిక్షణ, అభిరుచి, అంతర్ దృష్టి అవసరం.
‘కొన్ని కథల్లో నేను లోతుగా లీనమైపోతా. నాకు అది పూర్తిగా అర్థమయ్యేవరకూ పరిశోధన చేస్తా, మరిన్ని పుస్తకాలు చదువుతా, డాక్యుమెంటరీలు చూస్తా, నిపుణులతో మాట్లాడతా. కథ చెప్పడం అనేది ఇప్పటికీ కొనసాగుతున్న ప్రపంచంలోని పురాతన వృత్తి. సరిగా గమనిస్తే.. నేడు వ్యాపారులు తమ ఉత్పత్తులను అమ్మడం లేదు. కథలనే అమ్ముతున్నారని అర్థం అవుతుంది.
ఆ హైదరాబాదీ.. ఓ గొప్ప జ్ఞాపకం..
నా అత్యంత మరపురాని జ్ఞాపకాలలో ఒకటి హైదరాబాద్‌లో నేను ఇష్క్ సుఫియానాను ప్రదర్శించిన తర్వాత ఒక యువతి నా దగ్గరకు వచ్చి, నన్ను ఆప్యాయంగా కౌగిలించుకుంది. ‘నేను ఆత్మహత్యకు ప్రయత్నించాలనుకున్నా.. ప్రదర్శనకు వచ్చి చూశాక.. ఇప్పుడు ఆ ఆలోచన మారిపోయింది’ అని చెప్పారు. ‘ఒక కథకుడిగా నాకింకేం కావాలి? కొంతమంది అడుగుతుంటారు..
మంచి ఆదాయం ఇచ్చే మార్గం వదిలేశారు. ఏం సాధించారు? అని.. ‘నేను ఇప్పుడు మనశ్శాంతిగా.. ప్రతి రాత్రీ బాగా నిద్రపోతాను. నేటి బిజీ ప్రపంచంలో, అంతర్గత శాంతిని మించినలగ్జరీ ఏముంది?’ అనేదే నా సమాధానం.
‘ప్రతి ఒక్కరూ కథలు వినాలి.. ఎందుకంటే అవి మనల్ని మనలా తయారు చేస్తాయి’ అంటారు ల„Š మహేశ్వరి. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈయన పాడ్‌కాస్టర్, రచయిత, పాపులర్ స్టోరీ టెల్లర్ కూడా. నగరానికి గత కొంత కాలంగా కథలను మోసుకొచ్చే నిత్య అతిథిగా మారారు. తన కథలు, కవితల ద్వారా నగరవాసులను రంజింప చేస్తూ సిటీలో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్నారు. గత మే 24న భాస్కర ఆడిటోరియంలో సుఫియానా సమర్పించిన ల„Š మరోసారి గత ఆదివారం కొండాపూర్‌లోని హార్ట్ కప్ కాఫీలో ‘మై తేను ఫిర్ మిలేంగీ’ పేరిట మరో ప్రత్యేక స్టోరీ టెల్లింగ్ సెషన్ సమర్పించారు. ఈ సందర్భంగా పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే..
నాన్న చెప్పిన కథలే..
ఎడమ చేయి లేకుండా జని్మంచడంతో నా బాల్యం అంతా జీవన పోరాటాలతోనే సాగింది. సమాజపు హేళనలు, ఏదీ సాధించలేననే విమర్శలు, బెదిరింపులు ఇలా ఎన్నో ఎదుర్కొన్నా. కానీ తల్లిదండ్రులు నా పక్కన గట్టిగా నిలబడ్డారు. ‘నాన్న మా కుటుంబానికి కథకుడు.
మా కోసం ఎప్పుడూ కథలు షేర్–ఏ–షాయరీలను చెప్పేవాడు. చదువు పూర్తయ్యాక గుర్గావ్‌లో పెట్టుబడి బ్యాంకర్‌గా ఐదేళ్లకు పైగా పనిచేశాను. ఆదాయం బాగుంది, కానీ నేను కోరుకునే మనశ్శాంతి, సంతృప్తి దొరకలేదు. అదే సమయంలో ‘తమాషా’ సినిమా చూశాను. అది నాకు ఏమి చేయాలో చెప్పకపోయినా, యే తో నహి కర్ణ (ఇది చేయకూడదు) అని మాత్రం గ్రహించాను.
200కి పైగా ప్రదర్శనలు..
మీ కథలతో జనాన్ని ఎలా ఆకట్టుకోగలుగుతున్నారు? అని కొందరు అడుగుతుంటారు.. నిజాయితీగా చెప్పాలంటే, అది ఒక ట్రాన్స్ లాగా ఉంటుంది. నాకు వేదికపైకి వెళ్లి దిగడం మాత్రమే గుర్తుంటుంది. నేను 200కి పైగా ప్రదర్శనలు ఇచ్చాను. కానీ వాటిలో చాలా వాటిలో ఏం జరిగిందో నాకు గుర్తులేదు. తెలిసినదల్లా వారం పాటు ప్రదర్శన ఇవ్వకపోతే, నాకు అశాంతిగా అనిపిస్తుంది.
(చదవండి: ఈ వేధింపులను ఆపే మార్గం లేదా?)