
సాధారణంగా మనుషులు అడవులకూ, అడవి ప్రాణులకూ చెడ్డ వార్త. అంతే కాక మనము ఒక దుంగ నుంచి పడిపోయేంత సులువుగా ఉత్పత్తి చెందడానికి తప్ప ఇంకెందుకూ పనికిరానట్టుగా కనిపిస్తాము. కానీ ఈ స్టోరీలో, కొన్ని బతక నేర్చిన ప్రాణులకు మనుషులు వచ్చేదాకా ఇంత మంచి గతి పట్టలేదని రచయిత సంబరం చేసుకుంటున్నారు. వాటి సంఖ్య పెరుగుతూనే ఉన్నందున మనకి కృతజ్ఞత తెలపవలసింది కేవలం కాకులు, ఎలుకలు, బొద్దింకలు మాత్రమే కాదు.
చిరుతలు చూడండి. ఎంతో కాలంగా మనం ఈ జంతువులు అడవిలోనే నివసించాలని అనుకున్నాము. “సహజంగా అవి అక్కడ ఉండాల్సినవే ” అంటారు మేధావులు. ఆ చిరుతలు ఏవైనా దురదృష్ట వశాత్తు అడవి బయట కనిపిస్తే “అయ్యోపాపం. తప్పిపోయిందేమో” అనో లేదా “దీనికి అడవిలో ఆహరం దొరకటంలేదేమో” అని మనం అనుకుంటాం. అందుచేత మంచి పౌరుల్లా మనం ఆ ప్రాణుల్ని బంధించి, మనం వాటి మనుగడకి తగినదైనది అనుకున్న అడవిలో దానిని వదిలిపెడతాం.
కానీ ఆ జంతువులు తప్పిపోలేదని, మరి అవి పొరపాటున దారితప్పలేదని., ఆ పొలాలే వాటి ఇల్లులని పరిశోధన తెలుపుతోంది. అడవులు లేని చోట అవి చెరుకు పొలాల్లో దాక్కుంటాయి. కోతులూ, జింకలూ వేటడటానికి లేని చోట అవి స్వేచ్ఛగా తిరిగే పశువులనూ, ఊర కుక్కలనూ, అచ్చోసిన పందుల మీద బతుకుతాయి. చిరుతలకు, అడవి జింకను కూడా చూడని, అసల అడవి అంటె ఏమిటో తెలియని ప్రదేశాలు దేశం నలుమూలలా ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితే భారత దేశంలోని అతి సాధారణంగా కనిపించే మూడు విషసర్పాలది : నాగు పాము, కట్ల పాము ఇంకా రక్తపింజరి. వ్యవసాయ భూముల్లో సమృద్దిగా ధాన్యమే కాక లావుపాటి ఎలుకలు, చుంచులు కూడా ఉంటాయి. చుట్టుపక్కల పొలాలు నీట మునిగినప్పుడు, ఈ ఎలుకలను తినే పాములను తినేలా ఆహారం, ఉండటానికి బోరియలు పుష్కళంగా దొరుకుతాయి.
ఈ సమృద్దిగా ఉండే ఎలకలు, చుంచుల మందల పుణ్యమా అని, అడవులలో కంటే వ్యవసాయ భూములలోనే ఈ విషసర్పాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇంకా, ప్రపంచంలోకెల్లా ఎగిరే పక్షులలో పొడుగైన సారస్ క్రేన్ పక్షులు ఉత్తర్ ప్రదేశ్లోని ధాన్యపు పొలాల్లోని, చిత్తడి భూములలోని వాటి గుడ్లు పెట్టి, పిల్లలను పొదుగుతాయి.
గత రెండు దశాబ్దాలుగా పశువుల వైద్యం కోసం వాడే నొప్పి నివారిణి అయిన డైక్లోఫెనాక్ రాబందులకు విషపూరితంగా మారి, వాటి సంఖ్య అకస్మాత్తుగా తగ్గిపోయింది. కానీ ఈ విషమస్థితికి ముందు, జంతు కళేబరాలను మనము బహిరంగ స్థలాలలో వదిలేసే అలవాటు ఉండటంవల్ల ఇవి పక్షులు వందలలో కనిపించేవి. రాబందులు జంతు కళేబరాల నుంచి మాంసం నిముషాలలో తీసెయ్యగల అత్యున్నత పరిశుభ్ర మిషన్లు.
నగరాలలో మనం చెత్తకుప్పల్లో ఊరకుక్కల్ని చూస్తాం కానీ, వాటి హయామ్ నడిచే రోజుల్లో ఈ ఎగిరే స్కావెంజర్లు ఈ వాసనకొట్టే చెత్త కుప్పల్ని ఏలేవి. నీరు ఉన్న చోట బ్రాహ్మణి గ్రద్దలు, బెంగళూరు మైసూరు వంటి నగరాలలో నల్ల గెద్దలు ఈ పనిని స్వాధీన పరుచుకున్నాయి.
ఎంతో వింతగా, ఈ రాబందులు పాల్క్ స్ట్రైట్ దాటి శ్రీలంకలో నివాసం ఏర్పర్చుకోవడానికి మాత్రం ఎప్పుడూ వెళ్ళలేదు. ఒకసారి ఆ దీవి దేశాన్ని సందర్శించినప్పుడు, అక్కడ స్థానికులు సాధారణంగా పరిగణించే ప్రాణులను నేనూ, రోమ్ చూసి ఆశ్చర్యపోయాం. ఊబకాయంతో ఉన్న నీటి మానిటర్ బల్లులు, రాబందుల స్థానాలలో చెత్తకుప్పలపై రాజ్యం ఏలుతున్నాయి. వ్యవసాయ భూముల్లో వృద్ధి చెందుతూ.. రసం నిండిన టమాటాలను నవులూతూ తిరిగే నక్షత్ర తాబేళ్ళు, ప్రపంచంలోకేల్లా కీటకంగా పరిగణించబడే ఏకైక తాబేలు అయివుంటుంది.
శ్రీలంకలోని కొద్ది ప్రదేశాలలో మనుషుల కార్యకలాపాలు ఏనుగులకు కూడా లాభించాయి. వర్షాధారితమైన ఒకే పంట వ్యవసాయం, భూమి బీడయినప్పుడు మరల పెరిగే కలుపు మొక్కలు తిని వృద్ధి చెందదానికి ఆ గజాలకు సహాయపడుతుంది. మనిషి సృష్టించిన ఏ దానా భూములే లేకపోతే శ్రీలంక అంత ఎక్కువ ఏనుగుల సంఖ్యను భరించలేకపోయి ఉండేదని పరిశోదకులు చెబుతారు.
శ్రీలంకలోని బాగా దక్షిణంగా ఉన్న యాల నేషనల్ పార్క్ చుట్టుపక్కల ఉన్న ఎన్నో నీటి పారుదల చెరువులలో వండలాది మగ్గర్ మొసళ్లు నివసిస్తాయి. ఒకానొక రోజుల్లో ఇక్కడ ధాన్యం పండించిన వారి పూర్వికుల పుణ్యమా అని శ్రీలంకలోని ఈ చిన్ని ప్రదేశం విశాల భారతదేశం మొత్తంలో ఎక్కడా కనిపించనన్ని మొసళ్లకు నిలవు.
పై అన్ని ఉదాహరణలలోనూ, జంతు సమూహంతో నిండిన ప్రకృతిని సృష్టించడానికి రైతులు సహనం అనుకోకుండా వారి వ్యవసాయ పద్ధతులతో కలవడం వల్ల జరిగినవే. వానలకీ, శాంక్చ్యువరీలకీ బయట, మరి కాస్త ధ్యాస పెడితే, ఈ జంతువుల మనుగడ కోసం మనిషి మరింత చేయవచ్చు.
Author : Janaki Lenin -- జానకి లెనిన్
(చదవండి: Frogs: నన్నుఇంటికి తీసుకువెళ్ళు)