
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మొట్టమొదటి మహాసభలు అమెరికా, వర్జీనియాలోని లీస్‌బర్గ్‌లో ఉత్సాహంగా జరిగాయి. ఆగస్టు 30 నుంచి 31 వరకు రెండురోజుల పాటు భారీ ఎత్తున వీటిని నిర్వహించారు. GMA ప్రెసిడెంట్ వెంకట్ పెద్ది సారథ్యంలో కన్వెన్షన్ కన్వీనర్ సంగని రజనీకాంత్, GMA వ్యవస్థాపక సభ్యులు ప్రవీణ్ అండపల్లి, డాక్టర్ జనార్ధన్ , డాక్టర్ గణేష్ తోట, సతీష్ పసుపులేట్, దేవేష్ కుమార్, విజయ్ దండ్యాల, మురళీధర్ రావు , మహాసభ ఎగ్జిక్యూటివ్ కమిటీ సెక్రటరీ కమలాకర్ నల్లాల, ట్రెజరర్ వినయ్ పటేలోల్ల, జాయింట్ సెక్రటరీ సురేష్ చెంచల, జాయింట్ ట్రెజరర్ చంద్ర మోహన్ ఆవుల, మహాసభ కోర్ టీమ్ జనార్ధన్ పన్నెల , కృష్ణశ్రీ గంధం , అన్వేష్ బొల్లం, రంజిత్ భూముల, ఫౌండర్స్ కమిటీ, మహాసభ ఎగ్జిక్యూటివ్ కమిటీ, మహాసభ కోర్ కమిటీ, మహాసభ ఛైర్స్, GMA గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ టీమ్ తో పాటు వందల సంఖ్యలో వాలంటీర్లు అలుపెరుగకుండా కృషి చేసి ఈ మహాసభను గ్రాండ్ సక్సెస్ చేశారు. వచ్చిన అతిథులను ఆకట్టుకునేలా వినూత్నమైన కార్యక్రమాలను రూపొందించారు.
ఈ వేడుకలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, ప్రముఖ సినీ గేయ రచయిత,ఆస్కార్ విన్నర్ చంద్రబోస్, ప్రముఖ మ్యూజిక్ డైర్టకర్ కోటి, ప్రముఖ ఇంద్రజాలకులు సామల వేణు, మిమిక్రీ ఆర్టిస్ట్ మహేష్ రేగుల , గంగవ్వ, జయశ్రీ, తదితర సినీ, రాజకీయ, ఆధ్యాత్మిక ప్రముఖులతో పాటు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి.
GMA మహాసభలను ఆగస్టు 30 న బ్యాంక్వెట్ విందు కార్యక్రమంతో ఘనంగా ప్రారంభించారు. GMA ప్రెసిడెంట్ వెంకట్ పెద్ది, కన్వెన్షన్ కన్వీనర్ సంగని రజనీకాంత్, GMA టీమ్ పూజ నిర్వహించి మహాసభలకు శ్రీకారం చుట్టారు. ఇక తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ, బోనాలతో.. డప్పు చప్పుళ్ల మధ్య అందరూ నృత్యాలు చేస్తూ.. ఊరేగింపుగా వేదక వద్దకు తరలివచ్చారు.
అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కన్వెన్షన్ సావనీర్ ఆవిష్కరించారు. అసోసియేషన్ చేస్తున్న కార్యక్రమాలు, ఇతర వివరాలతో పొందుపరిచిన ఈ సావనీర్ ను అతిథులు ఆవిష్కరించారు. ఇక మహిళల కోసం ప్రత్యేకంగా అందాల పోటీలు, ముగ్గుల పోటీలతో పాటు సంగీత పోటీలు, చిన్నారుల కోసం మ్యాజిక్ షో నిర్వహించారు.
ఇక కార్యకర్తలలో ప్రత్యక ఆకర్షణగా భారతీయతను ఇనుమడింపజేసేలా వేదిక్ మ్యాథ్య్ నిలిచింది. గాయత్రి రజినీకాంత్ ఆధ్వర్యంలో బోధించబడిన క్లిష్టమైన గణిత సమస్యలకు వేదిక్ మ్యాథ్స్ చక్కని పరిష్కారంగా నిలుస్తుంది, గతకొంత కాలంగా అమెరికా వ్యాప్తంగా వేదిక్ మ్యాథ్స్ ఆదరణ పొందుతున్న విషయం విధితమే.! ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన యువత క్రూజ్ ట్రిప్ ఎంతగానో అలరించింది. ఇక బ్యూటీ పేజెంట్, మ్యాట్రిమోనియల్, GMA సరిగమ సంగీత పోటీలు ఎంతోగానో ఆకట్టుకున్నాయి.
ఇక వివిధ రంగాలలో అత్యద్భుతమైన ప్రతిభ పాఠవాలు కనబరచిన వారికీ GMA అవార్డ్సుఅందజేశారు. ఈ సందర్భంగా కన్వెన్షన్ కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు. డోనార్స్ ని, పలువురు నేతలను శాలువా, పుష్పగుచ్ఛాలతో సన్మానించారు. ఈ సందర్భంగా GMA ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి సభ్యులు వివరించారు.
ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ తన ప్రసంగంతో అందరినీ అలరించారు. సామాన్యుడిగా ప్రయాణం మొదలుపెట్టి.. ఆస్కార్ అవార్డు వరకు సాగిన ఆయన జర్నీ గురించి వివరించారు. ఇక చంద్రబోస్ మాటలకు హర్షాతిరేకాల ప్రతిస్పందనలతో మార్మోగిపోయింది. ఆయన సందేశాత్మక ప్రసంగం ప్రేక్షకులను, ముఖ్యంగా యువతను విశేషంగా ఆకర్షించింది. GMA ఆధ్వర్యంలో తనకు సన్మానం జరగటం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ఇక ఈ సందర్భంగా నిర్వహించిన కల్చరల్ పోగ్రామ్స్ ఆకట్టుకున్నాయి. ఇక కార్యక్రమంలో మిమిక్రీ ఆర్టిస్ట్ మహేష్ రేగుల హాస్యం పండించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను ఇమిటేట్ చేసి నవ్వులు పూయించారు. ఫైనల్‌గా తెలంగాణ జానపద లైవ్ బ్యాండ్ షో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ప్రముఖ గాయనీగాయకులు జానపద పాటలు పాడి అందరినీ మెప్పించారు. సూపర్‌హిట్ తెలంగాణ జానపద పాటలు, సినీ పాటలతో అలరించారు.

ఈ మహాసభల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. వేదపండితులచే సంప్రదాయ బద్ధంగా స్వామి వారి కళ్యాణం జరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో పాటు ఆధ్యాత్మిక భావాన్ని కల్పించడమే ప్రధాన ఉద్దేశ్యంగా స్వామి వారి వేడుకల్ని నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని.. స్వామివారి ఆశీస్సులు, తీర్ధప్రసాదాలు అందుకున్నారు.
ఈ మహాసభల్లో భాగంగా రెండు రోజు నిర్వహించిన పలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇక వేదికపై స్టూడెంట్స్ కెరీర్ పాత్, పొలిటికల్ ఫోరం, బిజినెస్ ఫోరం, ఇమ్మిగ్రేషన్ అండ్ వాల్ స్ట్రీట్ నిర్వహించారు. ఇక బ్రేకౌట్ సెషన్స్ లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. యూత్ సెషన్స్, ఉమెన్ ఫోరం, హెల్త్ సెమినార్, మాట్రిమోనీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను వేదిపై ఆహ్వానించి, ప్రసంగాల అనంతరం సత్కరించారు.
మున్నూరుకాపులతో పాటు బీసీలను మరింత చైతన్య పర్చేందుకు,సంఘటితం చేసేందుకు ఈ మహాసభను ఏర్పాటు చేసిన రజనీకాంత్, వెంకట్, వారి మిత్ర బృందాన్ని పలువురు అభినందించారు. అమెరికాలోనే కాకుండా ఇతర దేశాలలో స్థిరపడిన వీరంతా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా మొత్తానికి ఉపయోగపడాలని, బహుజనుల అభ్యున్నతి కోసం సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్బంగా పలువురికి GMA అవార్డులు అందజేశారు. ఇక అమెరికాలో ఉన్న వివిధ తెలుగు సంఘాల నేతలను వేదికపైకి పిలిచి నిర్వాహకులు సత్కరించారు. ఇక ఈ వేడుకల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఈవెంట్స్, హాస్యవల్లరులు జరిగాయి. ఈ మహాసభ సందర్భంగా వేసిన రంగవల్లులు అందరిని ఆకర్షించాయి.
ఇక ప్రముఖ ఇంద్రజాలికుడు సామల వేణు.. చిత్ర విచిత్ర జిమ్మిక్కులతో మాయా ప్రపంచాన్ని కళ్ళముందు ఆష్కరించారు. దేశ విదేశాల నుంచి విచ్చేసిన వందలాది మందిని సామల వేణు తన మ్యాజిక్ తో అద్భుత ప్రదర్శన ఇచ్చి అబ్బురపరిచారు.
ఆహుతుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాళ్లు, వేర్వేరు ఫుడ్ సెంటర్లు కనువిందు చేశాయి. బతుకమ్మ, దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది పండుగలను మరిపించే విధంగా ఉల్లాసభరిత వాతావరణంలో ఈ మహాసభ జరిగింది. రుచికరమైన తెలంగాణ వంటకాలతో పసందైనా విందు భోజనం అందిచారు.
GMA వేడుకలు ఘనంగా జరగడానికి తమకు సహకరించిన కమిటీ సభ్యులకు, EC, BOD, RVPS, సహాయ సహాకారాలు అందించిన దాతలకు, వేడుకల్లో పాల్గొన్న ప్రతిఒక్కరికీ అధ్యక్షులు వెంకట్ పెద్ది, కన్వెన్షన్ కన్వీనర్ సంగని రజనీకాంత్ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ ను విజయవంతంగా నడిపిస్తున్న డోనర్లను నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించి.. వారి సేవలను కొనియాడారు.
ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మహాసభలకు విచ్చేసిన అతిథులను ఘనంగా సత్కరించి వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అసోసియేషన్ తరపున పలు ప్రాంతాల్లో సేవలందిస్తున్న వాలంటీర్లను సత్కరించారు. ఈ సందర్భంగా 2026కు సంబంధించి అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కార్యవర్గ సభ్యులు.. సంఘం అభివృద్ధికి కృషిచేస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యులు, మహాసభల కన్వీనర్ రజనీకాంత్ సంఘని సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులందరినీ ఐక్యం చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా ఐకమత్యంతో ఉండాలని కోరారు.
వివిధ ప్రాంతాల సభ్యులను ఒకచోట చేర్చి సహకార స్ఫూర్తిని పెంపొందించడం లక్ష్యమన్నారు. మున్నూరుకాపు కుటుంబాలను అనుసంధానించి, వారి సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడం ,ప్రోత్సహించడమే సంఘం ప్రధాన ఉద్దేశమని చెప్పుకొచ్చారు. తమ ఆహ్వానాన్ని మన్నించి ఈ మహాసభలకు విచ్చేసిన తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యులు, అధ్యక్షుడు వెంకట్ పెద్ది ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
కన్వెన్షన్ ముగింపు వేడుకలలో భాగంగా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కోటి మ్యూజిక్ కన్సర్ట్ అందరిని మైమరిపించి మధురానుభూతులను అందించింది. కోటి ఆధ్వర్యంలో పలువురు సింగర్స్ సూపర్ హిట్ సాంగ్స్ పాడి ఆడియన్స్ ను మంత్రముగ్థులను చేశారు. సింగర్స్ అద్భుత పాటలతో సంగీతాల ఝురిలో వోలాలడిస్తు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. GMA కన్వెన్షన్‌లో పాల్గొన్న అతిథులకు ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతిని, ఆనందాన్ని ఈ మహాసభలు అందించాయి. భవిష్యత్తులో జరిగే మహాసభలకు GMA కన్వెన్షన్ సరి కొత్త మార్గాన్ని చూపించింది.