
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
కౌడిపల్లి(నర్సాపూర్): తల్లిదండ్రుల గొడవతో మనస్తా పానికి గురైన కూతురు ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి వివరాల ప్రకారం... మండలంలోని మహమ్మద్‌నగర్ గ్రామానికి చెందిన బండల మైసయ్య, శమంతల పెద్దకూతురు అక్షిత(21) ఇటీవల బీటెక్ పూర్తి చేసింది. ఇటీవల ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంది. కాగా తల్లిదండ్రులు ఇద్దరు తరచూ గొడవ పడుతుండేవారు. మంగళవారం రాత్రి ఇంటిముందు తల్లిదండ్రులు ఇద్దరూ సంసారం విషయంలో గొడవపడ్డారు. గొడవ పడొద్దని చెప్పినా వినకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై న అక్షిత ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్లి చున్నీతో ఉరివేసుకుంది. కొద్దిసేపటికి తల్లిదండ్రులు వెళ్లి చూడగా ఉరివేసుకుని ఉంది. కిందికి దించి చూడగా అప్పటికే మృతి చెందింది.