
విలాసవంతమైన జీవితం కంటే తల్లిదండ్రుల బాగోగులే ముఖ్యం అంటూ భారత సంతతి మహిళ భారత్‌కి తిరిగి వచ్చేయాలనకుంటున్నా అంటూ తన మనసులో మాటను నెట్టింట షేర్ చేసుకుంది. అయితే ఇక్కడ అంత జీతంతో తాను లైఫ్‌ని లీడ్ చేయగలనా అనే సందేహాన్ని కూడా వెలిబుచ్చింది. అయితే నెటిజన్లు ఆమె ఆలోచన విధానానికి ఇంప్రెస్ అవ్వగా మరికొందరూ వాళ్లు ఎన్నోత్యాగాలు చేసి పంపితే ఆ కష్టమంతా మట్టిలో కలిపేస్తారా అనే ప్రశ్నను లేవనెత్తడం విశేషం.
అసలేం జరిగిందంటే..యూఎస్‌లోని డెన్వర్‌లో తన జీవిత భాగస్వామితో విలాసవంతమైన జీవితాన్న గడుపుతున్న భారత సంతతి మహిళ రెడ్డిట్ వేదికగా తన గోడుని వెల్లబోసుకుంది. తాను భారత్‌కి తిరిగి వచ్చేయాలని చూస్తున్నట్లు తెలిపింది. తన తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చేశారని, వారి బాగోగులు చూసుకునేందుకు తిరిగి ఇండియాకు వచ్చేయాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ భారత్‌లో ప్రజలు కొందరు చాలా దురుసుగా, కోపంగా ప్రవర్తించడం చూసి చాలా అసహనానికి గురయ్యానని చెప్పుకొచ్చింది.
తాను మాస్టర్స్ పూర్తి చేశానని ఏడాదికి రూ. 3 కోట్లు పైనే సంపాదిస్తానని, తన భర్త ఏడాదికి దాదాపు రూ. 2 కోట్లు వరకు సంపాదిస్తారని అన్నారు. తల్లిదండ్రులను దగ్గరుండి చూసుకోవాలనే ఉద్దేశ్యంతో భారత్‌కి తిరిగి వచ్చేయాలని భావిస్తున్నా..బెంగళూరులో ఉండే అవకాశం లభిస్తోంది. అక్కడ ఏడాదికి సుమారు రూ. 1.2 కోట్లు వేతనం అని, అక్కడ లైఫ్ లీడ్ చేయడానికి ఆ మాత్రం సంపాదన సరిపోతుందా అని సందేహాన్ని వ్యక్తం చేస్తుంది. అయితే తనకు యూఎస్‌లో మంచి స్నేహితులు ఉన్నారని, సౌకర్యవంతంగా జీవించేదాన్ని అని చెప్పుకొచ్చింది.
అదీగాక అమెరికాలో తన జీతం పెద్ద మొత్తం కావడంతో చాలా లగ్జరీ లైఫ్‌ని లీడ్ చేయగలిగానని, అందువల్లే భారత్‌తో సహా వివిధ దేశాలకు సులభంగా వెళ్లగలిగేదాన్ని అని చెప్పుకొచ్చింది. అలాగే వర్క్ పరంగా ఎలాంటి ఒత్తిడి కూడా ఉండదంటూ అమెరికాలోని తన లైఫ్‌స్టైల్ గురించి తెలిపింది. పైగా తన తల్లిదండ్రులు అమెరికాకు వచ్చేందుకు సిద్ధంగా లేరంటోంది. అదీగాక వాళ్లు ఇక్కడ సంస్కృతికి, స్నేహితులకు అలవాటుపడ్డ మనుషులకు అలా నాలుగు గోడల మధ్య బతకడం అంటే అత్యంత దుర్భరంగా అనిపిస్తుందని వాపోయింది.
అందుకే వారి బాగోగులును తాను స్వయంగా చూసుకోవాలనే ఉద్దేశ్యంతో భారత్‌కి తిరిగి వచ్చేయాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది.,అయితే తన సొంతూరిలో ఉద్యోగం చేయడం సాధ్యపడదని ఇలా బెంగళూరులో ఉండేందుకు ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొంది. అయితే మరి బెంగళూరులో బతికేందుకు ఏడాదికి రూ. 1.2 కోట్లు సరిపోతుందంటారా అని సందేహ్నాన్ని లేవనెత్తతూ పోస్ట్ ముగించింది.
(చదవండి: నాన్న చెప్పిన కథలే.. స్ఫూర్తి..)