
నాటి నుంచి నేటి వరకు కేసీఆర్ వెంటే
జహీరాబాద్: బీఆర్‌ఎస్ పార్టీకి మాజీ మంత్రి హరీశ్‌రావు ఒక చరిత్ర అని, ఉద్యమం నాటి నుంచి నేటి వరకు ఆయన కేసీఆర్ వెంటే ఉన్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు అన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హరీశ్‌రావుపై కవిత చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేసి త్యాగం చేసిన చరిత్ర హరీశ్‌రావుదని పేర్కొన్నారు. బేగం బజార్‌కు వెళ్లి జెండా కలర్స్ కూడా ఆయన తెచ్చారని గుర్తు చేశారు. మొదటి జెండా దిమ్మె కట్టించింది కూడా అతడే అన్నారు. పార్టీకి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని కొనియాడారు. న్యూస్ పేపర్లు వేసు కుని నేలపై చాలా చోట్ల పడుకున్న వ్యక్తిత్వం అని వివరించారు. లక్ష్యం నెరవేర్చడానికి ఒక్క రోజు కూడా విరామం తీసుకోలేదన్నారు. ప్రజలకు చేరువలో ఉండి పని చేసే విషయాన్ని తాను ఆయన నుంచే నేర్చుకున్నట్లు చెప్పారు. కాళేశ్వరం కోసం మహారాష్ట్రకు 25 సార్లకు పైగా వెళ్లారన్నారు. ఏ శాఖ ఇచ్చినా సమర్థవంతంగా నిర్వహించారన్నారు.
ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు