
హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేపడుతున్న భీకర దాడులు (Israel Hamas Conflict) చిన్నారుల భవిష్యత్తును చిదిమేస్తున్నాయి. నిలువెల్లా గాయాలను మిగుల్చుతున్నాయి. 2023 అక్టోబరు నుంచి ఇప్పటివరకు దాదాపు 21 వేలమంది గాజా చిన్నారులు దివ్యాంగులుగా మారినట్లు ‘దివ్యాంగుల హక్కులపై ఐరాస కమిటీ (CRPD)’ వెల్లడించింది. సరిగ్గా ఈ దాడుల్లో జనవరి 29, 2024న యువ రజబ్ అనే ఆరేళ్ల బాలిక కూడా బలైన దృశ్యం అందరిని శోకసంద్రంలోకి నెట్టింది. ఎందుకంటే ఆమె దాడుల్లో చిక్కుకున్న క్షణంలో రికార్డు అయిన ఆ స్వరం అందరి హృదయాలను కదలించి ఆ దాడిపై క్షణ్ణంగా దర్యాప్తు చేసేలా ప్రేరేపించింది. ఆ ఉదంతంపై తీసిన నాటకం..మరింతమందికి చేరువై ఇజ్రాయెల్ సైన్యానికి నోట మాట రాకుండా చేసింది. అంతేగాదు ఆర్ట్‌తో అలాంటి హృదయవిదారక ఘటనకు మరింతగా ప్రాణం పోసి మానవత్వానికి ఊపిరిపోయడమే కాదు కళ గొప్పదనాన్ని హైలెట్ చేసింది.
ఆ నాటకమే గాజా అమ్మాయిపై తీసిన 'ది వాయిస్ ఆఫ్ హింద్ రజబ్' అనే చిన్న డ్రామా. 29 నిమిషాల నిడివితో కూడిన డాక్యుమెంట్ డ్రామను వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఈ నాటకం ఇజ్రాయెల్ సైనిక కాల్పుల మధ్య ఆరేళ్ల గాజా బాలిక విషాద మరణంపై న్యాయం తోపాటు యుద్ద రక్కసి కోరల్లో పసి ప్రాణాలు ఎలా చిక్కుకుని అల్లాడుతున్నాయో అనే విషయాన్ని హైలెట్ చేసింది. అంతేగాదు ఈ 23 నిమిషా నిడివి గల నాటం స్టాండింగ్ ఒవేషన్‌ను అందుకుంది.
ఫ్రాంకో-ట్యునీషియన్ కౌథర్ బెన్ హనియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ఇజ్రాయెల్ దళాల చేతిలో హత్యకు గురైన గాజాకు చెందిన ఆరేళ్ల బాలిక హింద్ రజబ్ హృదయ విదారకమైన చివరి క్షణాలు వివరిస్తుంది. ఈ నాటకం చూస్తున్న వాళ్లంతా "ఫ్రీ, ఫ్రీ పాలస్తీనా" అని నినాదాలు చేస్తూ, పాలస్తీనా జెండాలను ఊపుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
మరో విశేషం ఏంటంటే ఈ చిత్రంలో ఈ చిత్రంలో పాలస్తీనియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ నుంచి వచ్చిన నిజమైన ఆడియో ఉంది. ఆ వీడియోలో ఆ చిన్నారి కారులో మంటల్లో చిక్కుకున్నప్పుడూ.. దయచేసి నా దగ్గరకు రండి, దయచేసి రండి. నాకు భయంగా ఉంది" అని తన చివరి క్షణాల్లో అభ్యర్థిస్తున్న స్వరం స్ఫష్టంగా వినిపిస్తోంది.
రక్షణ కోసం ఆ చిన్నారి వేడుకున్న తీరు ప్రతి ఒక్కరి హృదయాన్ని కదలించింది. కానీ రక్షణ చర్యలు ఆలస్యం కావడంతో తన కుటుంబసభ్యులతో కలిసి విగతజీవిగా కనిపించిందా చిన్నారి. అంతేగాదు దర్యాప్తులో ఇజ్రాయెల్ సైన్యం మొదట్లో సంఘటనా స్థలానికి అంబులెన్స్ చేరుకోనివ్వకుండా దాదాపు మూడుగంటల పాటు నిరాకరించిందని తేలింది. అంతేగాదు ఆమెను రక్షించే ప్రయత్నంలో మరణించిన ఇద్దరు అంబెలెన్స్ కార్మికులు మృతదేహాలు కూడా ప్రమాదం జరిగిన ప్రాంతంలో లభించాయి కూడా. దాంతో మరింతగా దర్యాప్తు చేయగా విస్తుపోయే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి.
అల్ జజీరాతో కలిసి ఫోరెన్సిక్ ఆర్కిటెక్చర్, ఇయర్‌షాట్ చేసిన దర్యాప్తులో..ఆ ఘటన జరిగినప్పుడూ రజబ్ కారు నుంచి దాదాపు 13 నుంచి 23 మీటర్ల దూరంలోనే ఇజ్రాయెల్ ట్యాంకు ఉందని వెల్లడైంది. అలాగే జూలై 2024లో ఐక్యరాజ్యసమితి నివేదిక సైతం దీనిని ధృవీకరించింది. పైగా ఇజ్రాయెల్ దళాలు చాలా సమీపంలో కాల్పులు జరిగినట్లు నిర్థారించింది కూడా. దాంతో సంఘటన సమయంలో తమ దళాలు కాల్పుల పరిధిలో లేవంటూ అంతవరకు వాదించిన ఇజ్రాయెల్ సైన్యం సైతం మారుమాట్లాడకుండా సైలెంట్ అయ్యింది.
సదరు బాలిక తల్లి విస్మామ్ హమదా కనీసం ఈ చిత్రం ద్వారా అయినా ఈ సంఘర్షణకు ముగింపు ఉంటుందేమోనని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ప్రపంచం మొత్తం మేము చనిపోయేలా, ఆకలితో ఉండేలా, భయంతో జీవించేలా ఫోర్స్ చేసిందంటూ కన్నీటి పర్యంతమైందామె. కాగా, దర్శకురాలు బెన్ హనియా మాట్లాడుతూ.. "ఇలాంటి యుద్ధ విదారకర సంఘటనలను ఇలా నాటకం రూపంలో చిత్రంచడం వల్ల..దాని వెనుకున్న బాధకరమైన లోతులు ప్రజలకు చేరువవ్వడమే గాక, మానవత్వపు విలువలను గురించి నొక్కి చెబుతుంది. అదే సమయంలో సినిమా ప్రాముఖ్యత ఏంటో తేటతెల్లమవుతుందని చెబుతోంది". దర్శకురాలు బెన్ హనియా.
“#TheVoiceOfHindRajab cast hold up a picture of Hind Rajab during their record-breaking 23-minute-plus ovation this evening at the #VeniceFilmFestival.
Rajab was killed by Israeli forces in Gaza last year. The film chronicles the 6-year-old's final hours.”
via deadline pic.twitter.com/CkbumvkCn7— May ❤️🔥💊🪞 (@mayswiftiee) September 3, 2025
(చదవండి: అలా... ఆమె ప్రాణాలు కాపాడారు!)