
ఎన్నో విలాసంవంతమైన వస్తువులు, భవనాలు గురించి విన్నాం. కానీ ఇలాంటి అత్యంత ఖరీదైన ద్రవాలు గురించి మాత్రం విని ఉండరు. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకోబోయే ద్రవాలు ఉత్పత్తి చేయడం సాధ్యం కానివి. పైగా వాటి ఉపయోగాలు గురించి వింటే మాత్రం నోట మాట రాదు. ఇవి మనం చుట్టూ చూసే చిన్న చిన్న జీవుల్లోనే ఉన్నాయా..అని విస్తుపోతారు. అది కూడా మానవ రక్తం కంటే కూడా ఆ ద్రవాలే అంత విలువైనవా అని ఆశ్చర్యంకలుగక మానదు. మరి అవేంటో చూసేద్దామా.
తేలు విషం (రూ. 343 కోట్లు)
అన్నింటకంటే అత్యం ఖరీదైన ద్రవం తేలు విషం. వైద్య పరిశోధనలో ఎన్నో వ్యాధులకు అమూల్యమైన ఔషధం ఇది. ఇందులో మెడదడు కేన్సర్, ఆటో ఇమ్యూన్ వ్యాధుల చికిత్సకు ఉపయోగపడే ప్రోటీన్లు ఉంటాయట. దీన్ని అత్యంత జాగురకతతో చుక్కల వారీగా తీయాలట. అందువల్ల దీన్ని సేకరించడం అనేది అత్యంత శ్రమతో కూడుకున్న టాస్క్. అందువల్లే ఇంతల కోట్లలో ధరలో పలుకుతుందని నిపుణులు చెబుతున్నారు.
కింగ్ కోబ్రా విషం (రూ. 13 కోట్లు)
దీన్ని కూడా వైద్య పరంగా వినియోగిస్తారు. దీర్ఘకాలిక నొప్పిని నిర్వహణలో అద్భుతంగా పనిచేస్తుంది. తేలు విషం మాదిరిగానే సేకరిస్తారు. పైగా చుక్క కూడా అత్యంత ఖరీదైనది. ఇందులో ఓహానిన్ ప్రోటీన్ ఉంటుంది. నొప్పి నివారణ మందులలో ఉపయోగిస్తారు.
గుర్రపుడెక్క పీత రక్తం(రూ. 52 లక్షలు)
ఈ పీత రక్తాన్ని టీకాలు, IV ఔషధాలలో బ్యాక్టీరియా కాలుష్యాన్ని గుర్తించడానికి ఉపయోగిస్తారట. దీని నీలి రంగు రక్తం గడ్డకట్టే లక్షణాలు వైద్యానకి అత్యంత అమూల్యమైనదట. దీనికున్న డిమాండ్, పరిమిత సంఖ్యలో వీటి లభ్యత తదితర కారణాల రీత్యా దీని రక్తం అత్యంత ఖరీదని చెబుతున్నారు.
ఇన్సులిన్:(రూ. 11లక్షలు)
డయాబెటిస్ నిర్వహణకు అత్యంత కీలకమైన హార్మోనో ఇది. ఇది కూడా ఔషధ ధర రీత్యా అత్యంత ఖరీదైన ద్రవంగా నిలిచింది. ఇది లక్షలాది ప్రాణాలను కాపాడే దివ్యౌషధమైన ఈ ఇన్సులిన్ దాని ధర, లభ్యతపై ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఆందోళనలు పెంచుతోంది.
చానెల్ నెంబర్ 5: (రూ. 22 లక్షలు)
ఈ ఐకానిక్ ఫెర్ఫ్యూమ్ దాని సంక్లిష్ట ఫార్ములా, బ్రాండ్ కారణంగా అత్యంత ఖరీదైన ద్రవాలలో ఒకటిగా స్థానం దక్కించుకుంది. దీన్ని అత్యంత అరుదైన పూల నూనెల నుంచి తయారు చేస్తారట.
ప్రింటర్ ఇంక్:(రూ. 10 లక్షలు)
అనేక లగ్జరీ పెర్ఫ్యూమ్‌ల కంటే ఒక సాధారణ ప్రింటర్ ఇంక్ చాలా ఖరీదైనదట. రోజువారి జీవితాల్లో దీని పాత్ర ప్రధానంగా ఉన్నప్పటికీ ఈ సిరా ధర కూడా అత్యంత ఖరీదైనదేనని చెబుతున్నారు నిపుణులు.
మానవ రక్తం (రూ. 1లక్ష)
అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికి లేదా శస్త్ర చికిత్సలలో ఇది అత్యంత అవసరం. అయితే దీని ధర పరీక్ష, ప్రాసెసింగ్, సురక్షితమై నిల్వ కారణంగానే ఇది కూడా ఖరీదైన ద్రవాల్లో ఒకటిగా నిలిచింది. దీన్ని సేకరించగలమే గానీ ఉత్పత్తి చేయలేం. అలాగే దీన్ని స్వచ్ఛందంగా దానం చేస్తున్నప్పటికీ.... జాగ్రత్తగా పరిరక్షించడం అనేది గణనీయమైన ఖర్చులతో కూడుకున్నది కావడంతోనే ఇంతలా ధర పలుకుతోందని చెబుతున్నారు నిపుణులు.
(చదవండి: కన్నీళ్లు పెట్టించే 'ది వాయిస్ ఆఫ్ హింద్ రజబ్' డ్రామా..!)