
అభివృద్ధి పనులపై అధ్యయనం
పర్యటించిన యూపీ సర్పంచ్‌ల బృందం
మనోహరాబాద్(తూప్రాన్): గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, సర్పంచ్‌ల పాలన విధానం, చేపడుతున్న పనులపై అధ్యయనానికి ఉత్తరప్రదేశ్ నూతన సర్పంచ్‌ల బృందం మంగళవారం మండలంలో పర్యటించింది. ఈ సందర్భంగా తూప్రాన్ డీఎల్‌పీఓ యాదయ్య వారికి పలు అంశాలపై వివరించారు. ముప్పిరెడ్డిపల్లిలో రికార్డులు, ఇండ్ల అనుమతులు, పనుల తీరు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ పంచాయతీ వద్ద మొక్కలు నాటారు. అక్కడి నుంచి దండుపల్లి గ్రామంలోని పల్లె ప్రకృతివనం, డంప్‌యార్డ్, అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి, అభివృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రవీందర్, ఎంపీఓ శ్రీనివాస్‌రెడ్డి, ఏపీఓ ఆదినారాయణ, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.