
నేరాల నియంత్రణలో ‘సీసీ’లు
దౌల్తాబాద్(దుబ్బాక): నేరాలను నియంత్రించడంలో, నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని సిద్దిపేట సీపీ అనురాధ అన్నారు. మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల జియోట్యాగింగ్ ద్వారా సిద్దిపేట కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేయబడతాయని తెలిపారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రం, వివేకానంద యూత్ ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించారు. కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ నర్సింహులు, తొగుట సీఐ లతీఫ్, దౌల్తాబాద్, తొగుట ఎస్‌ఐలు అరుణ్‌కుమార్, రవికాంత్‌రావు, మాజీ జెడ్పీటీసీ భూపాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ వేణుగోపాల్, నాయకులు భద్రయ్య, రాములు, అశోక్, లాల్ రమేశ్, నర్సింహారెడ్డి, ఎల్లయ్య పాల్గొన్నారు.
సిద్దిపేట సీపీ అనురాధ