Telangana Crime News: ఒక్కసారిగా.. బుల్లెట్‌ బండి బాలుడి పై పడడంతో.. తీవ్ర విషాదం!
Sakshi News home page

ఒక్కసారిగా.. బుల్లెట్‌ బండి బాలుడి పై పడడంతో.. తీవ్ర విషాదం!

Sep 10 2023 5:02 AM | Updated on Sep 10 2023 1:42 PM

- - Sakshi

సంగారెడ్డి: బుల్లెట్‌ బండి వద్ద ఆడుకుంటున్న క్రమంలో అది మీద పడి బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన అమీన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాలు. నేపాల్‌కు చెందిన లక్ష్మణ్‌ రావల్‌ బతుకుదెరువు కోసం మూడేళ్ల క్రితం అమీన్‌పూర్‌ పరిధిలోని బీరంగూడకు వచ్చాడు. సాయి భగవాన్‌ ఎన్‌క్లేవ్‌ వద్ద నివాసం ఉంటూ పనులు చేసుకుంటున్నాడు.

ఇతనికి కుమారులు హేమంత్‌ రావల్‌(03), భాస్కర్‌ ఉన్నారు. హేమంత్‌ 8వ తేదీన ఇంటి పక్కన ఉండే పురుషోత్తం బుల్లెట్‌ బండి వద్ద ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు అది మీద పడింది. తీవ్ర గాయాలైన బాలుడిని చికిత్స నిమిత్తం చందానగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. బాలుడి తండ్రి లక్ష్మణ్‌ రావల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement