శివ్వంపేట(నర్సాపూర్): రైతులు ఆధునిక సాగుపై అవగాహన పెంచుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్త రవికుమార్ అన్నారు. ఆదివారం(ఐటీఎం) వ్యవసాయ కళాశాల విద్యార్థులు వరి సాగులో పీఎస్‌బీ వరినారు వేర్లు ముంచే పద్ధతిపై మండల పరిధిలోని చెన్నాపూర్ గ్రామ రైతులకు అవగాహన కల్పించారు. వరి నాట్లను నాటే ముందు పీఎస్‌బీ ద్రావణాన్ని తయారు చేసి, వరి నారు వేర్లను సుమారు 20 నుంచి 30 నిమిషాల పాటు ఆ ద్రావణంలో ముంచి నాటేయడం ద్వారా నేలలో లభ్యం కాని భాస్వరాన్ని(ఫాస్ఫరస్) మొక్కలకు సులభంగా అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, ఆర్‌ఏడబ్ల్యూఈ విద్యార్థులు దీక్షిత్, లోకేశ్వరి, సాయి హృతిక్, స్ఫూర్తి, జాహిత, జాహ్నవి, శాంతి భూషణ్, కృష్ణ సాయి, ప్రత్యూష, శ్రావంతి పాల్గొన్నారు.


