చేనేత బలోపేతానికి కృషి | - | Sakshi
Sakshi News home page

చేనేత బలోపేతానికి కృషి

Jul 13 2026 8:15 AM | Updated on Jul 13 2026 8:15 AM

ఎమ్మెల్సీ యాదవరెడ్డి, రాష్ట్ర చేనేత కార్పొరేషన్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌

దుద్దెడ చేనేత సహకార సంఘం చైర్మన్‌ ఎన్నిక ఏకగ్రీవం

కొండపాక(గజ్వేల్‌): చేనేత సహకార సంఘం సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బలోపేతం కోసం కృషి చేస్తామని ఎమ్మెల్సీ యాదవరెడ్డి, రాష్ట్ర చేనేత కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరి శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం మండలంలోని దుద్దెడ చేనేత సహకార సంఘం అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించారు. సంఘం పరిధిలో డైరెక్టరు పదవులకు మూడు రోజుల కింద జరిగిన ఎన్నికల్లో 9 మంది ఓటింగ్‌ ద్వారా ఎన్నికయ్యారు. కాగా డైరెక్టర్లలో ఒకరైన వడ్లకొండ శ్రీనివాస్‌ ఒక్కరే చైర్మన్‌ పదవికి నామినేషన్‌ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఆయన ఎన్నికై నట్లు రిటర్నింగ్‌ అధికారి సతీశ్‌రెడ్డి ప్రకటించారు. అనంతరం కమిటీ సభ్యుల ఎన్నిక జరగగా వైస్‌ చైర్మన్‌గా గంగుల గణేశ్‌, ప్రధాన కార్యదర్శి లగిశెట్టి ఆంజనేయులు, కోశాధికారి బొజ్జ నరేందర్‌, సహాయ కార్యదర్శి కిష్టయ్య, కార్యవర్గ సభ్యులు లలిత, లక్ష్మినారాయణ, సత్తవ్వ, వీరేశం ఎన్నికయ్యారు. వీరితో సహకార సంఘం కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, రాష్ట్ర చేనేత కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరి శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్‌ హాజరై పాలక మండలి సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలన్నారు. అనంతరం సహకార సంఘం చైర్మన్‌ను జర్నలిస్టులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌, భూంరెడ్డి, మహాదేవ్‌, జగదీశ్వర్‌, తిరుపతి, నందకుమార్‌, రాజేంద్రప్రపాద్‌, రాధాకృష్ణ, శ్రీహరి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement