ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికే ధర్నా | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికే ధర్నా

Jul 13 2026 8:15 AM | Updated on Jul 13 2026 8:15 AM

చేగుంట(తూప్రాన్‌): ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 14న తపస్‌ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్లం పేర్కొన్నారు. ఆదివారం చేగుంట తపస్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పీఆర్సీ, సీపీఎస్‌ రద్దు, 317 ఉద్యోగ బాధితుల సమస్యల పరిష్కారం, పెండింగ్‌ బకాయిల గురించి కలెక్టర్‌ కార్యాలయం వద్ద సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి సంఘం బాధ్యులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి సిద్దూ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్‌, వెంకటస్వామి, నర్సింహులు, జిల్లా నాయకులు ప్రసాద్‌రెడ్డి, సంతోష్‌, కిషన్‌, మెదక్‌ నాయకులు నరేందర్‌, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement