సబితా ఇంద్రారెడ్డి ఆస్తులు రూ.9.27 కోట్లు

- - Sakshi

మహేశ్వరం: తనకు రూ.9 కోట్లకు పైగా ఆస్తులున్నాయని, తనపై నాలుగు కేసులున్నాయని ఎన్నికల నామినేషన్‌ అఫిడవిట్‌లో మహేశ్వరం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పట్లోళ్ల సబితారెడ్డి పేర్కొన్నారు. ఆమె పేరు మీద కారు లేదని, చేతిలో రూ.6 లక్షల50వేల నగదు, 900 గ్రాముల బంగారం ఉందని అఫిడవిట్‌లో తెలిపారు.

స్థిరాస్తులు:
సంగారెడ్డి జిల్లా కోహిర్‌ మండలం మాద్రి గ్రామం, తాండూరు మండలం మల్కాపూర్‌, చేవెళ్ల మండలం కౌకుంట్ల, తాండూరు మండలం కోటబాసుపల్లి, చేవెళ్ల మండల కేంద్రంలో సుమారు రూ.2.28 కోట్లు విలువ చేసే 35.19 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కమర్షియల్‌ ఆస్తులు హైదరాబాద్‌లోని శ్రీనగర్‌, శంషాబాద్‌ మధురానగర్‌, తాండూరులో శంకర్‌రావు నగర్‌, చేవెళ్ల కౌకుంట్ల గ్రామాల్లో రూ.7.97 కోట్లు విలువ చేసే ఇళ్లు, ప్లాట్లు ఉన్నాయి. అప్పులు ఏమీ లేవు. చరాస్తులు, స్థిరాస్తులు మొత్తం రూ.9.27 కోట్లు ఉన్నాయని తెలిపారు.

Read latest Rangareddy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top