ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Dec 28 2025 12:47 PM | Updated on Dec 28 2025 12:47 PM

ఖాళీల

ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం తుక్కుగూడ: మహిళ, శిశు సంక్షేమ శాఖ పరిధిలో నిర్వహిస్తున్న మిషన్‌ వాత్సల్య పథకం, జిల్లా బాలల పరిరక్షణ విభాగం(డీసీపీయూ)లో, స్పెషలైజ్డ్‌ అడాప్షన్‌ ఏజెన్సీ (ఎస్‌ఏఏ)లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనన్నుట్లు ఆ శాఖ అధికారులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మూడు నర్స్‌(మహిళ) పోస్టులు, నాలుగు చౌకీదార్‌ పోస్టులు, ఆయాలు (మహిళ) ఐదుగురుని భర్తీ చేస్తామన్నారు. నర్స్‌ పోస్టులకు రూ.11,916, మిగిలిన వారికి రూ.7,994 చొప్పున వేతనం ఉంటుందని చెప్పారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు జనవరి 3 వరకు కలెక్టర్‌ కార్యాలయంలో నైడీఓసీ జీ–06 భవనంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. పెద్దఅంబర్‌పేటలో నాగోల్‌ సర్కిల్‌ కార్యాలయం అబ్దుల్లాపూర్‌మెట్‌: ఎల్‌బీనగర్‌ జోన్‌ పరిధిలోని నాగోల్‌ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌గా రవీందర్‌రెడ్డిని నియమిస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీలో విలీనానికి ముందు నుంచి పెద్దఅంబర్‌పేట కమిషనర్‌గా పనిచేస్తున్న రవీందర్‌రెడ్డిని తాజాగా సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌గా నియమించడంతో శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. పెద్దఅంబర్‌పేట మున్సిపల్‌ కార్యాలయంలోనే నాగోల్‌ సర్కిల్‌ కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ మేరకు కార్యాలయంపై పేర్లు మార్పు చేసిన అధికారులు పాలనను కొనసాగిస్తున్నారు. సర్కిల్‌ పరిధిలోకి నాగోల్‌, మన్సూరాబాద్‌, జీఎస్‌ఐ, లెక్చరర్స్‌కాలనీ, పెద్దఅంబర్‌పేట, కుంట్లూర్‌ డివిజన్లు రానున్నాయి. ఆదిబట్ల సర్కిల్‌ డీసీగా సత్యనారాయణరెడ్డి ఇబ్రహీంపట్నం రూరల్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ శంషాబాద్‌ జోన్‌ ఆదిబట్ల సర్కిల్‌ నూతన డిప్యూటీ కమిషనర్‌గా సత్యనారాయణరెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ తాత్కాలిక డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన బాలకృష్ణ పదోన్నతిపై మాదాపూర్‌ డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. నూతన డీసీ మాట్లాడుతూ సర్కిల్‌ పరిధిలోని కొంగరకలాన్‌, ఆదిబట్ల, తొర్రూర్‌, తుర్కయంజాల్‌ అభివృద్ధిపై దృష్టిసారిస్తానన్నారు. బడంగ్‌పేట్‌ డీసీగా త్రిల్లేశ్వర్‌రావు బడంగ్‌పేట్‌: శంషాబాద్‌ జోన్‌ పరిధిలోని బడంగ్‌పేట సర్కిల్‌–16 డీసీగా టీఎస్‌వీఎన్‌ త్రిల్లేశ్వర్‌రావు శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు మేనేజర్‌లు నాగేందర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి ఫైళ్లపై సంతకాలు తీసుకున్నారు. ఫిర్జాదిగూడ కమిషనర్‌గా ఉన్న త్రిల్లేశ్వర్‌ రావు బదిలీపై బడంగ్‌పేటకు వచ్చారు. ఈ సందర్భంగా నూతన డీసీ మాట్లాడుతూ.. సర్కిల్‌ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

డిప్యూటీ కమిషనర్‌గా రవీందర్‌రెడ్డి

పది క్లస్టర్స్‌.. ఆరు డెకాయ్‌ టీమ్స్‌

న్యూ ఇయర్‌ వేడుకల నేపథ్యంలో హెచ్‌–న్యూ అప్రమత్తం

డ్రగ్స్‌ కట్టడికి ప్రత్యేక బృందాల ఏర్పాటు

సాక్షి, సిటీబ్యూరో: న్యూ ఇయర్‌ వేడుకల నేపథ్యంలో నగరంలో జీరో డ్రగ్స్‌ కోసం పోలీసులు పకడ్బందీగా ప్రణాళిక రూపొందించారు. ‘జీరో ఇన్సిడెంట్‌’కోసం లా అండ్‌ ఆర్డర్‌ అధికారులు, ‘జీరో యాక్సిడెంట్‌’కోసం ట్రాఫిక్‌ పోలీసులు... ‘జీరో డ్రగ్స్‌’కోసం హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌–న్యూ) బృందాలు పనిచేస్తున్నాయి. కొత్వాల్‌ వీసీ సజ్జనర్‌ ఆదేశాల మేరకు డ్రగ్స్‌ కట్టడికి పది క్లస్టర్లు, ఆరు డెకాయ్‌ బృందాలను ఏర్పాటు చేసినట్లు హెచ్‌–న్యూ డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌ రంగనాథ్‌ శనివారం వెల్లడించారు. హెచ్‌–న్యూ ఇన్‌స్పెక్టర్లు జీఎస్‌ డానియేల్‌, ఎస్‌.బాలస్వామి నేతృత్వంలో 16 బృందాలు శుక్రవారం రాత్రి నుంచే రంగంలోకి దిగాయని పేర్కొన్నారు. క్లస్టర్‌ బృందాల్లో హెచ్‌–న్యూతోపాటు ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ అధికారులు ఉంటారు. నార్కోటిక్స్‌ డాగ్‌ స్క్వాడ్‌లోని జాగిలాలతో కలిసి పబ్బులు, క్లబ్బులు, బార్లు, రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు చేస్తారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని అక్కడికక్కడే ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్స్‌తో పరీక్షిస్తారు. శుక్రవారం రాత్రి నిర్వహించిన తనిఖీలు, పరీక్షల్లో అందరికీ నెగెటివ్‌ ఫలితం వచ్చింది. డెకాయ్‌ బృందాలు మఫ్టీల్లో తిరుగుతూ డ్రగ్స్‌ దందాపై కన్నేయడంతోపాటు అలాంటి వారిని పట్టుకోవడానికి ఆపరేషన్లు చేస్తాయి.

ఖాళీల భర్తీకి  దరఖాస్తుల ఆహ్వానం 
1
1/1

ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement