సాలార్‌పూర్‌లో కవిత రాత్రి నిద్ర
● జనంబాటలో భాగంగా కడ్తాల్ మండలంలో పర్యటన
● గ్రూప్–1 పరీక్షలు, ఉద్యోగాలు, పెన్షన్లపై ప్రభుత్వాన్ని నిలదీత
కడ్తాల్: ‘డబ్బులున్న వాళ్లకు ఉద్యోగం ఇచ్చి.. లేని పేదగిరిజనులను మోసం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు’అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. తెలంగాణ వచ్చిన 12 ఏళ్లలో మూడు సార్లు గ్రూప్–1 పరీక్షలు నిర్వహించి, మూడు సార్లు ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఆరోపించారు. కష్టపడి చదువుకుని, నీతినిజాయితీతో పరీక్ష రాసిన ప్రతీ బిడ్డకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి శ్రీజనంబాటశ్రీకార్యక్రమంలో భాగంగా శనివారం రాత్రి కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండలం సాలర్‌పూర్‌తండాలో ఆమె పర్యటించింది. సేవాలాల్ మహరాజ్‌కు పూజలు చేసి, అనంతరం తండావాసులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత అక్కడే రాత్రి నిద్ర చేశారు. జనంబాట కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 17 జిల్లాలు పర్యటించాం. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నాం. కలెక్టర్లను, ఎమ్మెల్యేలను, మంత్రులను తాను గట్టిగా ప్రశ్నిస్తున్నందు వల్లే...ప్రజా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మహిళలకు ప్రతి నెలా రూ.2500, అదే విధంగా 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలకు స్కూటీలు, వృద్ధులకు రూ.4 వేల ఫించను ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి మొండి చేయి చూపిందని విమర్శించారు.


