నమ్మకంగా నయవంచన ! | - | Sakshi
Sakshi News home page

నమ్మకంగా నయవంచన !

Sep 24 2026 12:06 AM | Updated on Sep 24 2026 12:06 AM

సిరిసిల్ల: జిల్లాలో తూకంలో మోసాలను పట్టించుకునే వారు కరువయ్యారు. ప్యాకేజ్డ్‌ బియ్యం బస్తాలను సైతం 25 కిలోలకు బదులుగా 23 కిలోలను తూకం వేయిస్తూ.. వ్యాపారులు మోసం చేస్తున్నారు. సిరిసిల్ల, వేములవాడ మార్కెట్‌లో కొందరు వ్యాపారులు తూనికల రాళ్ల స్థానంలో బండ రాళ్లతో తూకం వేస్తున్నారు. ఇంకొందరైతే ఏళ్ల కిందట స్టాంపులు వేసిన బాట్లను వినియోగిస్తున్నారు. జిల్లాలో 260 గ్రామాలు.. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో నిత్యం తనిఖీలు చేయడం తూనికలు, కొలతల శాఖ అధికారులకు సాధ్యం కావడం లేదు. లైసెన్స్‌ హోల్డర్లతో తూనికల రాళ్లకు సీళ్లు వేయిస్తున్నారు. అయితే పర్యవేక్షణ లోపంతో తూకంలో మోసాలు జరుగుతూనే ఉన్నాయి.

మోసాలకు శిక్షలు.. జరిమానాలు

తక్కువ తూకం, ముద్ర వేయని కాంటాలు ఉపయోగించడం నేరం. ఇలాంటి మోసాలకు పాల్పడిన వారికి జరిమానాలు విధిస్తారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు వస్తువులను విక్రయించడం నేరం. మొదటిసారి ఈ నేరానికి పాల్పడితే గరిష్టంగా రూ.25వేల జరిమానా, అదే తప్పు మళ్లీ చేస్తే జరిమానాతోపాటు జైలుశిక్ష కూడా విధిస్తారు. వినియోగదారులు మోసాలకు గురయితే తెలంగాణ లీగల్‌ మెట్రాలజీ హెల్ప్‌లైన్‌ 1800 425 00333లో ఫిర్యాదు చేయవచ్చు.

‘కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన ఓ రైతు తన కూతురు పెళ్లికి రెండు క్వింటాళ్ల జైశ్రీరాం బియ్యాన్ని సిరిసిల్లలో కొనుగోలు చేశారు. క్వింటాలుకు రూ.7,600 చొప్పున చెల్లించారు. ఎనిమిది 25 కిలోల బస్తాలను ఆటోలో ఇంటికి తీసుకెళ్లారు. ఓ బియ్యం బస్తాకు రంద్రం పడడంతో కొంత బియ్యం పోయాయి. ఆందోళన చెందిన సదరు రైతు స్థానిక వ్యాపారి వద్ద బియ్యం బస్తాలను సరిచూసుకునేందుకు ఎలక్ట్రానిక్‌ కాంటాపై తూకం వేయగా.. రంద్రం పడిన బస్తాలో 8 కిలోల బియ్యం పోయినట్లు గుర్తించారు. మిగతా వాటిని తూకంగా వేయగా 25 కిలోలకు బదులు 22 కిలోలే ఉన్నాయి.’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement