సీఎం సభ భద్రతా ఏర్పాట్లు పరిశీలన | - | Sakshi
Sakshi News home page

సీఎం సభ భద్రతా ఏర్పాట్లు పరిశీలన

Sep 24 2026 12:06 AM | Updated on Sep 24 2026 12:06 AM

సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈనెల 30న పర్యటించనున్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్లను ఎస్పీ మహేశ్‌ బీ గీతే బుధవారం పరిశీలించారు. హెలీప్యాడ్‌, పార్కింగ్‌ స్థలాన్ని పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. వీవీఐపీ, వీఐపీ భద్రత, ట్రాఫిక్‌ నియంత్రణ, వాహనాల పార్కింగ్‌, ప్రజల రాకపోకలు, అత్యవసర సేవల నిర్వహణపై చర్చించారు. రోడ్లు భవనాల శాఖ డీఈఈ శాంతయ్య, స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ గాండ్ల వెంకటేశ్వర్లు, సిరిసిల్ల టౌన్‌ సీఐ శ్రీనివాస్‌, ఎస్సైలు గణేష్‌, నాగరాజు, రాజు పాల్గొన్నారు.

సీఎం టూర్‌ మ్యాప్‌ పరిశీలన

వేములవాడ: ఈనెల 30న సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పట్టణానికి వస్తున్న సందర్భంగా బుధవారం రాత్రి ప్రభుత్వవిప్‌ ఆది శ్రీనివాస్‌, ఎస్పీ మహేశ్‌ బీ గీతే, ఎస్బీ డీఎస్పీ వెంకటేశ్వర్లు రాజన్న గుడి చెరువు ట్యాంక్‌బండ్‌పై సీఎం సభాస్థలి, రూట్‌ మ్యాప్‌ను పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement