చందుర్తి(వేములవాడ): వర్షం పడి ఒర్రె పారితే రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామంటూ ఎన్గల్ గ్రామస్తులు గురువారం వరదనీటిలో నిరసన తెలిపారు. ఇరువై ఏళ్లుగా ఈ సమస్యను పట్టించుకోవడం లేదన్నారు. బ్రిడ్జి నిర్మించాలని కోరారు.
మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి
సిరిసిల్ల అర్బన్: రా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద గురువారం నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పబ్బ నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఎస్.రాజిరెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, ప్రభాకర్, అనిల్‌రావు, వంశీధర్‌రావు, సత్యంరావు పాల్గొన్నారు.
పిడుగుపడి విద్యుత్ అంతరాయం
సిరిసిల్ల: బుధవారం రాత్రి భారీ వర్షాలతో, పిడుగుపడి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వేములవాడ డివిజన్ పరిధిలోని నాలుగు 33 కేవీ ఫీ డర్లు బ్రేక్‌డౌన్ కావడంతో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. గురువారం పిడుగుపడిన ప్రాంతాల్లో రిపేరు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.


