రోషన్స్‌.. అదుర్స్‌ | - | Sakshi
Sakshi News home page

రోషన్స్‌.. అదుర్స్‌

Sep 25 2026 2:35 AM | Updated on Sep 25 2026 2:35 AM

న్యూస్‌రీల్‌

శుక్రవారం శ్రీ 25 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

సిరిసిల్లటౌన్‌: కార్మికక్షేత్రంలో వినాయక రోషన్లు ఆకట్టుకుంటున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజైన గురువారం వినాయక మండపాల నిర్వాహకులు రోషన్లు ఏర్పాటు చేశారు. అన్ని వినాయక మండపాల్లో బొమ్మల కొలువులతో ప్రత్యేకంగా అలంకరణలు చేశారు. వినాయకుల వద్ద విద్యుత్‌ దీపాలు, భారీ సెట్టింగులతో అలంకరించారు. హిమాలయాలు, గుహలు, పల్లెవాతావరణం తలపించే బొమ్మల కొలువులు ఆకట్టుకున్నాయి. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో గురువారం ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయణగౌడ్‌, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఆనునూరి బాలరాజు, గడ్డం నర్సయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement