అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి

Sep 25 2026 2:29 AM | Updated on Sep 25 2026 2:29 AM

● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

సిరిసిల్ల: వికసిత్‌ గ్రామ పంచాయతీ ప్రణాళికల(వీజీపీపీ)లో భాగంగా గ్రామాల్లో నీటి భద్రత, వసతులు, వాతావరణ మార్పుల ప్రభావాలు ఎదుర్కొనేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వీబీజీరామ్‌జీలో స్థానిక అవసరాలకు అనుగుణంగా పనులు గుర్తించాలన్నారు. జీపీల వారీగా ప్రణాళికా ప్రక్రియను నిర్వహించాలని సూచించారు.

వైద్యసేవలు విస్తృతం చేయాలి

ప్రభుత్వ వైద్యసేవలు విస్తృతం చేయాలని కలెక్టర్‌ కోరారు. సీజనల్‌ వ్యాధులు, ఇమ్యూనైజేషన్‌, ఎన్‌సీడీ స్క్రీనింగ్‌, మొబైల్‌ ఎక్స్‌రే టీబీ కేసులపై ప్ర త్యేక శ్రద్ధ చూపాలన్నారు. జిల్లాలో 531 టీబీ కేసులు ఉన్నాయని వివరించారు.

చేయూత పెన్షన్లు పరిశీలించాలి

చేయూత పెన్షన్ల దరఖాస్తులు పరిశీలించాలని, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్‌ కోరారు. గుడిసెల్లో ఉన్న 289 మందికి ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు.

ఖరీఫ్‌ కొనుగోళ్లు పక్కాగా చేపట్టాలి

ఖరీఫ్‌ పంటల కొనుగోలుకు ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్‌ కోరారు. జిల్లాలో 2,40,000 టన్నుల దొడ్డు ధాన్యం దిగుబడి వస్తుందని, కాంటాలు, లారీలు, గన్నీబ్యాగులు, ప్యాడీక్లీనర్లు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు.

క్రాప్‌ బుకింగ్‌ పూర్తి చేయాలి

జిల్లాలో ఎరువుల కొరత లేదని, క్రాప్‌ బుకింగ్‌ 53 శాతం పూర్తయిందని కలెక్టర్‌ తెలిపారు. జిల్లాకు 21వేల టన్నుల ఎరువులు అవసరం ఉండగా.. 23వేల టన్నులు కొనుగోలు చేశారని వివరించారు.

మెనూ ప్రకారం భోజనం అందించాలి

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించా లని కలెక్టర్‌ కోరారు. జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ హాస్టల్‌ను తనిఖీ చేశారు. కిచెన్‌లో బియ్యం, పప్పులు, కూరగాయలను పరిశీలించారు. సమీక్ష ల్లో డీఆర్డీవో లక్ష్మీనారాయణ, డీఏవో అఫ్జల్‌ బేగం, హార్టికల్చర్‌ అధికారి శరత్‌, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, పీఆర్‌ ఈఈ సుదర్శన్‌రెడ్డి, డీవీఏహెచ్‌ఓ శ్రీధర్‌, ఇన్‌చార్జి డీపీవో వీరభద్రయ్య, డీఎంహెచ్‌వో ఏంజెలా ఆల్ఫ్రెడ్‌, హౌజింగ్‌ పీడీ వెంకట మాధవరావు, మైనింగ్‌ ఏడీ క్రాంతికుమార్‌, డీసీ ఎస్‌వో బుచ్చి బాబు, మేనేజర్‌ గోపాల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement