ఆర్థిక ఇబ్బందుల్లోనూ అభివృద్ధి ఆగదు | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందుల్లోనూ అభివృద్ధి ఆగదు

Sep 25 2026 2:29 AM | Updated on Sep 25 2026 2:29 AM

● 30న సీఎం సభను సక్సెస్‌ చేయాలి ● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

● 30న సీఎం సభను సక్సెస్‌ చేయాలి ● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

సిరిసిల్ల/వేములవాడ/వేములవాడరూరల్‌/రుద్రంగి: రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధి, సంక్షేమం ఆగడం లేదని ప్రభుత్వ విప్‌, వేములవా డ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని చేనేత, జౌళిశాఖ ఆఫీస్‌, షాదీఖానా భవనంలో కార్మిక సంఘాలు, ఆసాములు, వేములవాడ, రుద్రంగిల్లో పార్టీ కార్యకర్తలతో గురువారం వేర్వేరుగా సమావేశమయ్యారు. విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్‌ ఉండగా.. 2023 వరకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారని, ఆ అప్పులకు నెలకు రూ.6వేల కోట్ల వడ్డీ కటా ల్సి వస్తుందన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా.. ఏ ఒక్క సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాన్ని ఆపకుండా కొనసాగిస్తున్నామన్నారు. సిరిసిల్లకు రూ.200 కోట్లతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షి యల్‌ స్కూల్‌, తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ మంజూరైందని వివరించారు. రూ.300 కోట్ల బతుకమ్మ చీరల బకాయిలు గత ప్రభుత్వం పెట్టిపోతే.. ఈ ప్రభుత్వం చెల్లించిందని గుర్తుచేశారు. 30వ తేదీన సిరిసిల్లకు వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి సభను విజ యవంతం చేయాలని కోరారు. కాలేజీ మైదానం నుంచి పాదయాత్రగా సీఎం అందరినీ కలుస్తూ.. బైపాస్‌ రోడ్డులోనే సభా స్థలికి చేరుకుంటారని తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కె.కె.మహేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు, చేనేత, జౌళిశాఖ ఏడీ సంతోష్‌కుమార్‌, కౌన్సిలర్లు శ్రీనివాస్‌, శ్రీశైలం, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చొప్పదండి ప్రకాశ్‌, ఆకునూరి బాలరాజు, గోలి వెంకటరమణ, కార్మిక నాయకులు పంతం రవి, మూషం రమేశ్‌, కోడం రమణ పాల్గొన్నారు.

లక్ష తగ్గొద్దు

సీఎం పాల్గొనే సభకు లక్ష మందికి తగ్గకుండా చూడాలని విప్‌ ఆది శ్రీనివాస్‌ కోరారు. వేములవాడలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. గ్రామా ల వారీగా బాధ్యతలు తీసుకున్న నాయకులు జన సమీకరణ చేపట్టాలని సూచించారు. వేములవాడ ఏఎంసీ చైర్మన్‌ రొండి రాజు, పీఏసీఎస్‌ చైర్మన్‌ వకుళాభరణం శ్రీనివాస్‌, ఆత్మ కమిటీ చైర్మన్‌ ముస్కు ముకుందరెడ్డి, రుద్రంగి సర్పంచ్‌ గండి లక్ష్మీనారాయణ, ఏఎంసీ చైర్మన్‌ చెలుకల తిరుపతి, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు గంగనర్సయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement