సిరిసిల్లటౌన్/వేములవాడ: అత్తాపూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన న్యాయవాదుల మొబైల్ ఫోన్లు లాక్కొని, దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై డీజీపీ చర్యలు తీసుకోవాలని కోరుతూ సిరిసిల్ల, వేములవాడల్లో న్యాయవాదులు గురువారం నిరసన తెలిపారు. వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిట్టల మనోహర్ మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గొంటి శంకర్, జాయింట్ సెక్రెటరీ కనికరపు శ్రీనివాస్, ఈసీ మెంబర్లు ఉల్లెందుల అనిల్, వోద్యారపు వేణు, మహిళా ప్రతినిధి తమిరి అన్నపూర్ణ, కుమారి, బూర సరిత, నాయీమా నసారి, మాజీ అధ్యక్షులు గుడిసె సదానందం పాల్గొన్నారు.
సిరిసిల్లకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్
సిరిసిల్ల: నియోజకవర్గానికి రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ (వైఐఐఆర్‌ఎస్)ను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కేంద్రం సమీపంలోని పెద్దూరు బైపాస్ రోడ్డు లేదా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్ వద్ద నిర్మించే అవకాశం ఉంది. 2,500 మంది విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌ను నిర్మించనున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్‌లో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్లకు ఈనెల 30న వస్తున్న నేపథ్యంలో విద్యాశాఖపరంగా పరిపాలన అనుమతులు లభించడం విశేషం.
రోడ్డుపై నాట్లు వేసి నిరసన
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని కస్బేకట్కూర్ గ్రామం చింతలపల్లెలో గ్రామస్తులు గురువారం రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ వర్షాకాలం వచ్చిందంటే రోడ్డుపై నీరు నిలుస్తోందని గ్రామపంచాయతీకి ఎన్నిసార్లు చెప్పినా స్పందన లేదన్నారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌ను శ్రీసాక్షిశ్రీ వివరణ కోరగా వర్షం కురిసినప్పుడు రోడ్డుపై నీరు నిలుస్తుందని, రోడ్డు పక్కన గుంతలు తవ్వేందుకు సహకరించడం లేదన్నారు.
జాతీయ స్థాయికి ఎంపికై న క్రికెటర్‌కు సన్మానం
సిరిసిల్లటౌన్: సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ గజ్జెల దేవరాజ్ ఆధ్వర్యంలో జాతీయ క్రికెట్‌కు ఎన్నికై న క్రీడాకారిణి బత్తుల అక్షరను సన్మానించారు. గజ్జెల దేవరాజ్ మాట్లాడుతూ అక్షరకు క్రికెట్ కిట్టును అందిస్తామన్నారు. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటకు చెందిన బత్తుల నర్సింలు–లక్ష్మి దంపతుల కూతురు అక్షర జాతీయస్థాయి క్రికెటర్‌గా ఎదిగింది. బుస్స వేణు, రాచర్ల వెంకన్న, పత్తిపాక పద్మ, శంకర్, కర్నె లక్ష్మి, గుగులోతు రేణ, మాడుగుల వనజ, నడిమెట్ల శ్రీనివాస్, పసుల బాబు పాల్గొన్నారు.
ఎస్సెస్సీ టాపర్‌కు రూ.లక్ష బహుమానం
ఇల్లంతకుంట(మానకొండూర్): ఎస్సెస్సీ–2026 పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన బొడ్డు వర్షినికి గురువారం రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా శ్రీరామ్ చిట్ ఫండ్స్ వారు రూ.లక్ష చెక్కును అందించారు. బొడ్డు వర్షిని మండలంలోని రేపాక హైస్కూల్‌లో 10వ తరగతి చదువుకుంది. 2026లో ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో మానకొండూర్ నియోజకవర్గంలో అత్యధికంగా 586 మార్కులు సాధించింది.


