తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో భౌతికశాస్త్ర పరిజ్ఞానంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ, స్టార్టప్ నైపుణ్యాలపై బుధవారం ఒక్క రోజు వర్క్‌షాప్ నిర్వహించారు. శాతవాహన యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి డి.సురేష్‌కుమార్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.రమాకాంత్, అసిస్టెంట్ ప్రొఫెసర్ జి.రమేశ్ అతిథులుగా హాజరయ్యారు. రిసోర్స్ పర్సన్, ఇన్నోవేటర్ బి.మల్లేశం విద్యార్థులకు ప్రాథమిక భౌతికశాస్త్ర సూత్రాలతో సరికొత్త ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఎలా రూపొందించవచ్చో ప్రయోగాత్మకంగా వివరించారు. ప్రిన్సిపాల్ జయ, వైస్‌ప్రిన్సిపాల్ రాధిక, అధ్యాపకులు వాణిశ్రీ, శ్రీకళ పాల్గొన్నారు.


