● చెరువుల్లో కవర్లు వేయొద్దు ● జిల్లా ఇన్‌చార్జి పంచాయతీ అధికారి వీరభద్రయ్య
ముస్తాబాద్(సిరిసిల్ల): పర్యావరణహితంగా గణేశ్ నిమజ్జనోత్సవాలను నిర్వహించుకోవాలని ఇన్‌చార్జి డీపీవో వీరభద్రయ్య సూచించారు. ముస్తాబాద్‌లో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. వీరభద్రయ్య మాట్లాడుతూ చెరువులు, వాగులు, కుంటల్లో గణేశ్ విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేయాలని, కవర్లు, ఇతర వస్తువులను నీటిలో కలపవద్దని కోరారు. నిమజ్జనం తెల్లవారి పారిశుధ్య పనులు చేపట్టాలని పంచాయతీ పాలకవర్గం, అధికారులకు సూచించారు. సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి, ఉపసర్పంచ్ విజయ్‌రెడ్డి, ఎంపీవో వాజిద్, ఇన్‌చార్జి కార్యదర్శి భిక్షపతి, తాళ్ల శ్రీను, వెంకటేశ్ తదితరులున్నారు.


