ధరలు ప్రదర్శించాలి | - | Sakshi
Sakshi News home page

ధరలు ప్రదర్శించాలి

Sep 7 2026 7:27 AM | Updated on Sep 7 2026 7:27 AM

స్మార్ట్‌ సిరిసిల్ల స్ఫూర్తిని కొనసాగించేలా పట్టణంలో నలువైపులా కొత్తగా పబ్లిక్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేయాలి. ఇప్పుడున్న సులభ్‌ కాంప్లెక్సుల్లో నిర్వాహకులు దోపిడీకి పాల్పడకుండా ధరల పట్టిక, సమయపాలన బోర్డులు ఏర్పాటు చేయాలి. టాయిలెట్స్‌ శుభ్రంగా ఉంచడం లేదు. తొట్టీలు పాడైనా మార్చడం లేదు. ఫినాయిల్‌, బ్లీచింగ్‌ చేయడం లేదు. అధికారులకు చెబితే పట్టించుకోవడం లేదు.

– బియ్యంకార్‌ శ్రీనివాస్‌, సిరిసిల్ల

ప్రతిపాదనలు పూర్తయ్యాయి

పాతబస్టాండులో సులభ్‌ కాంప్లెక్సు స్థానంలో మోడల్‌ టాయిలెట్స్‌ నిర్మిస్తున్నాం. అక్కడ ప్రయాణికుల కోసం తాత్కాలిక టాయిలెట్స్‌ ఏర్పాటు చేశాం. స్మార్ట్‌ వాష్‌రూమ్స్‌ స్థానంలో కొత్త నిర్మాణం కోసం ప్రతిపాదనలు చేశాం. త్వరలోనే కార్యరూపం దాల్చుతుంది. పబ్లిక్‌ టాయిలెట్ల నిర్వహణపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం.

– ఎం.ఎ.ఖదీర్‌పాషా,

మున్సిపల్‌ కమిషనర్‌. సిరిసిల్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement