● మరుగున పడుతున్న టాయిలెట్ల నిర్వహణ ● పనికిరాకుండా స్మార్ట్‌ టాయిలెట్స్‌ ● పట్టించుకోని అధికారులు, పాలకులు | - | Sakshi
Sakshi News home page

● మరుగున పడుతున్న టాయిలెట్ల నిర్వహణ ● పనికిరాకుండా స్మార్ట్‌ టాయిలెట్స్‌ ● పట్టించుకోని అధికారులు, పాలకులు

Sep 7 2026 7:51 AM | Updated on Sep 7 2026 7:51 AM

● మరుగున పడుతున్న టాయిలెట్ల నిర్వహణ ● పనికిరాకుండా స్మార్ట్‌ టాయిలెట్స్‌ ● పట్టించుకోని అధికారులు, పాలకులు ● జిల్లా కేంద్రంలో పబ్లిక్‌ టాయిలెట్ల నిర్వహణ గాడితప్పింది. ● ప్రధాన జంక్షన్లు, మార్కెట్లు, బస్టాండ్లు, షాపింగ్‌ ఏరియాల్లో టాయిలెట్స్‌ లేవు. ● పట్టణం నలువైపులా ఉన్న స్మార్ట్‌ వాష్‌రూమ్స్‌ పూర్తిగా శిథిలమయ్యాయి. ● రూ.కోట్లు ప్రజాధనం వెచ్చించి ప్రజా మూత్రశాలలు, మరగుదొడ్లు ఏర్పాటు చేయించారు. కానీ నిర్వహణ సరిగ్గా లేక కంపు కొడుతున్నాయి. ● పాతబస్టాండులో టాయిలెట్స్‌ను కొత్తగా నిర్మి స్తుండగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మొ బైల్‌ వాష్‌రూమ్స్‌ నుంచి దుర్గంధం వస్తోంది. ● బతుకమ్మ ఘాట్‌, అంబేడ్కర్‌ చౌరస్తా, లేబర్‌అడ్డా, కూరగాయల మార్కెట్‌, రైతుబజార్‌, ఆఫీస్‌రోడ్డు, సుభాష్‌నగర్‌, ఫారెస్ట్‌ ఆఫీస్‌ వద్ద గల పబ్లిక్‌ టాయిలెట్స్‌, సులభ్‌ కాంప్లెక్సుల నిర్వహణపై విమర్శలు వస్తున్నాయి.

సిరిసిల్లటౌన్‌: స్వచ్ఛ సిరిసిల్లలో స్మార్ట్‌ వాష్‌రూమ్స్‌ తుప్పుబడుతున్నాయి. గతంలో జాతీయ అవార్డులు సాధించిన పట్టణంలో ఇప్పుడు ఒకటికి, రెంటికి స్థానికులు తిప్పలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి వచ్చి పోయే సందర్శకులకు అత్యవసర పరిస్థితిలో ఇబ్బంది పడుతున్నారు. ఉగ్గపడుతూ.. తెలిసిన వారింటికి వెళ్లే దుస్థితి ఉంది. జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్‌, కొత్తబస్టాండు, కొత్తచెరువు, మానేరుతీరం, ప్రధాన జంక్షన్లు, షాపింగ్‌ ఏరియాల్లో టాయిలెట్స్‌ లేక జనాలు ఇబ్బంది పడుతున్నారు.

ఇలా అయితే ఎలా ?

పట్టణంలో టాయిలెట్స్‌ ఇలా..

టాయిలెట్స్‌(పురుషులు) 39(సీట్లు)

టాయిలెట్స్‌(మహిళలు) 29(సీట్లు)

బాత్రూమ్స్‌(పురుషులు) 06

బాత్రూమ్స్‌(మహిళలు) 04

యూరినల్స్‌(పురుషులు) 33

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement