వేములవాడ: భీమన్నను జిల్లా ప్రిన్సిపల్ జడ్జి పి.నీరజ కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. వేదోక్త ఆశీర్వచనం అందించారు.
విద్యుత్ భద్రతకు ప్రాధాన్యం
సిరిసిల్లటౌన్: వినాయక వేడుకల్లో విద్యుత్ భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు టీజీఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ గణేశ్ ప్రకటనలో తెలిపారు. గణేశ్ మండపాలు, నిమజ్జన మార్గాల్లో ప్రత్యే క తనిఖీలతో విద్యుత్ ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మండపా ల ఏర్పాటు, విద్యుత్ అలంకరణలు, విగ్రహా ల తరలింపు, నిమజ్జనం సమయంలో మండపాల నిర్వాహకులు, విద్యుత్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యుత్ లైన్లకు సమీపంలో గణేశ్ విగ్రహాలు, క్రేన్లు, మెటల్ ఫ్రేములు తీసుకెళ్లడం ప్రమాదకరమన్నారు. తెగిపోయిన తీగలు, లూజ్ లైన్లు, ప్రమాదకర స్థితిలో ఉన్న విద్యుత్ స్తంభాలు కనిపిస్తే వెంటనే 1912 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.
లారీని అడ్డుకున్న గ్రామస్తులు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని సారంపల్లిలో వేగంగా వెళ్తున్న లారీని గ్రామస్తులు అ డ్డుకున్నారు. వారం రోజులుగా గ్రామం నుంచి మట్టి తరలిస్తున్నారు. నెమ్మదిగా కాకుండా వేగంగా లారీలు వెళ్తుండడంపై గ్రామస్తులు ఆగ్రహించారు. వేగంగా వెళ్తున్న లారీని మొదట గ్రామపంచాయతీకి, ఆ తర్వాత తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
నాంపల్లి గుట్టపై వాహనాల రద్దీ
వేములవాడఅర్బన్: రాజన్న అనుబంధ ఆలయమైన నాంపల్లి గుట్టపై శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బారులుతీరారు. గుట్ట పైకి వచ్చిన భక్తులు ఆహ్లాదకర వాతావరణంలో నరసింహుడిని, కాళీయమర్ధనంలోని నాగదేవతను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
జిల్లా అంతటా వర్షం
సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా ఆదివారం తెల్లవారుజామున వర్షం కురిసింది. బోయినపల్లిలో అత్యధికంగా 12.1 మిల్లీమీటర్లు పడింది. వేములవాడ, రుద్రంగి, చందుర్తిల్లో 1.7 మిల్లీ మీటర్ల, వేములవాడ రూరల్‌లో 2.8, సిరిసిల్లలో 0.2, కోనరావుపేటలో 1.6, ఎల్లారెడ్డిపేటలో 6.5, ముస్తాబాద్‌లో 1.3, తంగళ్లపల్లిలో 0.9, ఇల్లంతకుంటలో 2.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వీర్నపల్లి, గంభీరావుపేట మండలాల్లో పెద్దగా వర్షం పడలేదు.


