సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులు | - | Sakshi
Sakshi News home page

సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులు

Sep 6 2026 2:07 AM | Updated on Sep 6 2026 2:07 AM

విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలి

ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

సిరిసిల్ల: సమాజాన్ని మార్చే శక్తి ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని, విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శనివారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పురస్కారాలకు ఎంపికైన జిల్లాలోని 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ తల్లిదండ్రుల తరువాత విద్యార్థులను ప్రభావం చూపేది ఉపాధ్యాయులేనన్నారు. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌, అబ్దుల్‌ కలాం, మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల బోధనలు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.

విద్యార్థులకు టీచర్లే రోల్‌ మాడల్‌

విద్యార్థులకు టీచర్లు రోల్‌ మోడల్‌ అని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను ఆరో తరగతిలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పద్యం, స్పీచ్‌ ఇవ్వడం మరిచిపోలేని అనుభూతి అని గుర్తు చేసుకున్నారు. అప్పటి తమ మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌ జిల్లా కలెక్టర్‌ను కలిసి ఆమె మాటలతో స్ఫూర్తి పొందానన్నారు.

అవార్డు పొందిన ఉపాధ్యాయులు వీరే..

జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు పొందిన వారిలో చిట్నేని శ్రీకాంత్‌రావు, తిరుమల మనోహరాచారి, ఆడెపు రాజేశం, అజ్మీరా మదన్‌లాల్‌, గుర్రం సందీప్‌, నర్ర శ్రీనివాసరెడ్డి, మధుకర్‌రెడ్డి, గంప లక్ష్మీనారాయణ, ఎం.లక్ష్మయ్య, మోహమ్మద్‌ రహీం, సీహెచ్‌.రమాదేవి, ఎం.కోటేశ్వర్‌, కొప్పు రాములు, వెంగల మహేశ్‌, మాదాడి వెంకటరావు, కుమ్మరి మల్లేశం, సీహెచ్‌.మాధవిలత, ఎన్‌.కనకయ్య, ఈ.శ్రీనివాస్‌, కపిల్ల నరేశ్‌, రామగిరి స్వరాజ్యలక్ష్మి, కొత్తపల్లి మమత, యాస శ్రీలత, డి.రఘు, ఎం.సుజాత, బోనగిరి రాజేందర్‌, ఊతం విజయకుమార్‌, దరిపెల్లి రాజేశం, బొల్లి రమేశ్‌, అణువోజు రాజు, తెల్ల వకుల, మేకల పద్మ, మామిళ్ల విఠల్‌, కె.జయలక్ష్మి, ఆర్‌.వసంత, బి.సుధారాణి, టి.గీత ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయణగౌడ్‌, సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, డీఈవో మొండయ్య, కోనరావుపేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కచ్చకాయల ఎల్లయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement